టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ లో ఎంతో క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే బెస్ట్ ఫినిషర్ గా మహేంద్రసింగ్ ధోని కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది . కానీ 2019లో జరిగిన ప్రపంచ కప్ లో  తన స్థాయిలో రాణించలేకపోయాడు అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ తర్వాత పూర్తిగా క్రికెట్ కు  దూరం అయిపోయాడు ధోని . ఆ తర్వాత ఐపీఎల్లో రాణిస్తే... మళ్లీ ఈ సంవత్సరం జరగబోయే ప్రపంచ కప్ లో జట్టులో స్థానం సంపాదించవచ్చు అని అభిమానులు ఎదురు చూశారు.కానీ  అయితే ధోని  జట్టులోకి రావడం కష్టమే అంటున్నాడు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. ధోని స్థానంలో ఆటగాడిని భర్తీ చేయడానికి బిసిసిఐ ఇప్పటికే ఎంతో ముందుకు వెళ్ళిపోయింది అంటున్నాడు వీరేంద్ర సెహ్వాగ్. 

 

 

 దీంతో టీమిండియా లో ధోని కి స్థానం లేదు అంటున్నాడు... ప్రస్తుతం ఉన్న టీం తో ధోని ఆడ లేకపోవచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. ఎందుకంటే ప్రస్తుతం రిషబ్ పంత్ కె.ఎల్.రాహుల్ మంచి ఫామ్ లో ఉన్నారని... రాహుల్ ప్రస్తుతం కీపర్ గా  బ్యాట్స్మెన్ గా  అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాడు అంటూ తెలిపాడు. ఇలా ఆటగాళ్లు బాగా ఆడుతున్నప్పుడు ధోని గురించి ఆలోచించాల్సిన కారణం ఏం  ఉంటుంది అంటూ వ్యాఖ్యానించాడు వీరేంద్ర సెహ్వాగ్. క్రికెట్ లో ప్రతి ఆటగాడు కెరియర్లో ఓ దశ ఎదుర్కొంటాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. గతంలో చాలామంది దిగ్గజ ఆటగాళ్లకు సైతం ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అంటూ గుర్తు చేశారు. 

 

 

 అయితే మహేంద్ర సింగ్ ధోనీ భవితవ్యంపై ఇప్పటికే సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వీరేంద్ర సెహ్వాగ్  చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారి పోయాయి. అయితే ధోనీ ఐపిఎల్ లో అద్భుతంగా రాణించి టీమిండియా జట్టులో స్థానం సంపాదిస్తాడు. ప్రపంచ కప్ లో తప్పక ఆడుతాడు అనే నమ్మకంతోనే ఉన్నారు మహేంద్రసింగ్ ధోని అభిమానులు. మహేంద్రసింగ్ ధోని ఆటను చూసేందుకు కూడా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతలో అభిమానులను నిరాశపరుస్తూ ఐపీఎల్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక గతంలో కూడా ధోని భవితవ్యంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: