ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఇండియాలో కూడా రోజు రోజుకీ ఎక్కువవుతోంది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్ యొక్క ప్రభావం బాగా కనబడుతుంది. దీంతో కేంద్ర వైద్య శాఖ అధికారులు రాష్ట్రాలకు కొన్ని సూచనలు మరియు జాగ్రత్తలు తెలియజేస్తూ వస్తున్నారు. ఇటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మరియు ప్రజల మనోభావాల విషయంలో బాగా గౌరవించే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విషయంలో కూడా వెనకడుగు వేయకుండా చాలా దూకుడు గా నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయంగా కేసీఆర్ ఎంత బలంగా ఉన్నా సరే...తెలంగాణ ప్రజల ప్రయోజనాలు గురించి ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అన్నట్టుగా ముందుకు పోతారు.

 

ఇటువంటి నేపథ్యంలో కరోనా వైరస్ విషయంలో చిన్న బిళ్ళ వేసుకుంటే ఇబ్బంది ఉండదు అని చెప్పిన కెసిఆర్, ఆ తర్వాత ముందు జాగ్రత్త చర్యలను కాస్త ఎక్కువగానే తీసుకున్నారు. ప్రజలను ఎక్కడిక్కడ అప్రమత్తం చేయడమే కాకుండా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. దేశ విదేశాల నుంచి వచ్చేవారికి హైదరాబాద్‌ ఒక కేంద్రం. వైరస్‌ విస్తరణ ప్రమాదం ఎక్కువ. అందుకే, అక్కడ విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. జిమ్‌లు, పబ్బులు మూసివేశారు. మరెన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మాత్రం చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో గాని ఇంకా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో గానీ ఎక్కడా పెద్దగా హడావిడి చేయకుండా వ్యవహరించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి ప్రమాదకరమైన వైరస్ విషయంలో కెసిఆర్ మాదిరిగా సైలెంట్ గా ప్రజలను కట్టడిచేసే పాయింట్ లో రాష్ట్రంలో కెసిఆర్ ఏ విధమైన నిర్ణయాలు తెలంగాణలో తీసుకున్నారో వాటిని అవలంబిస్తే బాగుంటుందని చాలామంది అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: