ప్రపంచం మొత్తం కరోనా.. కరోనా అంటూ జపం చేసే పరిస్థితి ఏర్పడింది.  ఏ ముహూర్తంలో ఈ భయంకరమైన కరోనా వైరస్ చైనాలోని పుహాన్ నుంచి పుట్టుకొచ్చింది.. ప్రపంచ వ్యాప్తంగా జనలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఎక్కడ చూసినా ఈ కరోనా వైరస్ గురించిన చర్చలే సాగుతున్నాయి.  కరోనా వైరస్‌ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ప్రతి రోజు వందలాది మంది ప్రజలు వివిధ ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ వార్డుల్లో చేరుతున్నారు. వైరస్ సోకిన బాధితులతో పాటు ఆ లక్షణాలతో పరీక్షలు చేయించుకొని ఫలితాల కోసం వేచిచూస్తున్న వారిని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచుతున్నారు. భారత దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 128 కేసులు దాటిపోయాయి.  ముగ్గురు మరణించారు.. అన్ని రాష్ట్రాల్లో కరోనా గురించిన సూచనలు ఇస్తున్నారు.

 

ఇక కరోనా బాధితుల కోసం కేరళ అందరికంటే ముందుగా ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసింది. కరోనా నేపథ్యంలో ప్రజల ఆహార అలవాట్లపై అనేక అనుమానాలు వ్యాపిస్తుండగా.. ఐసోలేషన్‌ వార్డులో ఉన్న వారికి ఎలాంటి ఆహారం అందిస్తున్నామో కేరళ ప్రభుత్వం వివరాలు వెల్లడించింది.   కళామస్సెరీ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో రెండు రకాల మెనూ ఏర్పాటు చేశారు.  అయితే ఇందులో ఒక మెను భారతీయులుకు అందిస్తున్నామని.. మరో మెను మెనూను విదేశీయులకు అందిస్తున్నట్టు ఎర్నాకులం జిల్లా కలెక్టర్‌‌ ఎస్. సుహాస్ చెప్పారు. బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ, సాంబార్, రెండు ఉడకబెట్టిన గుడ్లు, ఆరెంజ్ పండ్లు, టీ అందజేస్తున్నారు.

 

ఆ వెంటనే ఉదయం 10.30 గంటల సమయంలో పండ్ల రసం ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో చపాతీలు, కేరళ మీల్స్‌ పాటు చేపల ఫ్రై, మినరల్ వాటర్ ఉన్నాయి. ఆపై, మూడు గంటల సమయంలో టీతో పాటు బిస్కెట్లు అందజేస్తున్నారు. అంతే కాదు రాత్రి పూట భోజనంలో అన్నంతో పాటు రెండు అరటి పండ్లు ఇస్తున్నారు. విదేశీయులకు లంచ్‌లో టోస్టెడ్‌ బ్రెడ్‌, ఛీస్‌తో పాటు కొన్ని పండ్లు అందజేస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌లో సూప్, పండ్లు, రెండు గుడ్లు ఉన్నాయి. ఆ తర్వాత పైనాపిల్ జ్యూస్ ఇస్తున్నారు. రాత్రి భోజనంలో టోస్టెడ్‌ బ్రేడ్‌, ఎగ్స్ , పండ్లు అందిస్తున్నారు. అంతే కాదు విటి తో పాటు వార్తా పత్రికలు కూడా అందుబాటులో ఉంచుతున్నామన్నారు.  మొత్తానికి కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ రకమైన ఫుట్ ఫాలోయింగ్ చేయాల్సి వస్తుందని అంటున్నారు బాధితులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: