జగన్ ఏపీ సీఎం గా మంచి మెజారిటీతో గెలిచారు. ఆయన నవరత్నాల హామీలను కూడా నెరవేర్చారు. ఒకేసారి నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. రైతు భరోసా,  అమ్మ ఒడి వంటి భారీ స్కీములకు శ్రీకారం చుట్టారు.  మహిళలకు రక్షణగా దిశ చట్టాన్ని తెచ్చారు. 

 

ఇలా జగన్ కీర్తి దేదీప్యమానంగా వెలిగిపోతే ప్రత్యర్ధి పార్టీలకు చుక్కలు కనిపిస్తున్నాయి. జగన్ కి పది నెలల కాలంలో జనాదరణ తగ్గిందని భ్రమించి తమను తాము మభ్యపెట్టుకున్నాయి. చంద్రబాబు అయితే జగన్ కుర్చీ ఎక్కిన మరుస‌టి రోజు నుంచే రచ్చ మొదలెట్టేశారు. ఆయన పక్కన పవన్ కళ్యాణ్ తయారైపోయారు.

 

ఇక వామపక్షాలు కూడా రెడీగా ఉంటే, బీజేపీ సైతం అదే రూట్లోకి వచ్చేసింది. ఇది నిజంగా చిత్ర విచిత్రమైన కాంబో. వామపక్షాలకు, బీజేపీకి అసలు పడదు, అలాగే కాంగ్రెస్ కి బీజేపీకి బధ్ధ వైరం. కానీ జగన్ విషయంలో మాత్రం అన్ని పార్టీలు ఒక్కటై మూకుమ్మడిగా విరుచుకుపడిపోతున్నాయి.

 

సరే అన్ని పార్టీలు అనుకున్నాయి లోకల్ బాడీ ఎన్నికల్లో తామే గెలుస్తాం. జగన్ కి తెలియక సాధారణ ఎన్నికల్లో జనం ఓటేశారు కానీ ఈసారి స్థానిక  విజయం మాదేనని ధీమా పడ్డాయి. ఇక బ్యాలెట్ పేపర్ మీద ఎన్నికలు జరిగితే ఎపుడైనా జయం మాదేనని కూడా చంద్రబాబు లాంటి వారు నిబ్బరంగా ఉన్నారు. తీరా ఎన్నికల షెడ్యూల్ రాగానే అసలు కధ బయటపడింది.

 

ఈ ఎన్నికల్లో వైసీపీకి మరో మారు బంపర్ మెజారిటీ ఖాయమని విపక్షాలు అర్ధమైపోయింది. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అంతటి వాడే నవరత్నాలు బాగా జనంలోకి పోయాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం దండుగ అనేశారు. ఇక జగన్ కి మళ్ళీ చాన్స్ ఇచ్చేందుకు ఓటర్లు  రెడీ అయిపోయారని తెలియడంతో ఎక్కడ లేని భయం విపక్షంలో కనిపించింది. దాంతో అంతా కలసి ఎన్నికలు రద్దు, వద్దు అంటూ డిమాండ్ చేయడం ప్రారంభించారు.

 

పైకి కరోనా  వైరస్ అంటున్నారు కానీ జనంలో జగన్ కి ఆదరణ ఉన్నంతవరకూ ఎన్నికలు పెట్టవద్దన్నది విపక్షాల ఆలోచనగా ఉంది. ఈ ఎన్నికల్లో కూడా చిత్తు అయితే ఇక ఉనికి ఉండదన్నది వారి ఆందోళనకు కారణమని అంటున్నారు. ఎన్నికలే జరగకపోతే జగన్ కి జనంలో వ్యతిరేకత ఉందని ఎప్పటిలాగానే  ప్రచారం చేయవచ్చు. తాము బలంగా ఉన్నామని క్యాడర్ కి చెప్పుకోవచ్చు. 

 

ఇక ఎన్నికలు రద్దు చేయడం అంటూ జరిగితే ఏపీలో లోకల్ ఫైట్ విపక్షం భయమే కారణమని అనుకోవాలని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ ఇమేజ్ డ్యామేజ్ కావాలి. వైసీపీ సర్కార్ ఫేడౌట్ కావాలి. ఇది విపక్షాల అజెండా. ఆ రోజు వచ్చేవరకూ ఎన్నికలు వద్దనే అంటాయి. మరి వరసగా సంక్షేమ పధకాలతో దూసుకుపోతున్న జగన్ జనాల నాడి పట్టేసుకున్నారు. ఆయన తగ్గుతారా. విపక్షాల వ్యూహాలు నెగ్గుతారా. వెయిట్ అండ్ సీ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: