కరోనా  వైరస్.. మొన్నటి వరకు చైనాలో వినిపించిన ఈ మాట ప్రస్తుతం ప్రపంచం మొత్తం వినిపిస్తోంది. కాదు కాదు ప్రపంచం మొత్తం దద్దరిల్లిపోతోంది. కరోనా  ఎఫెక్ట్ వల్ల ప్రపంచం మొత్తం ప్రాణభయంతో చిగురుటాకులా వణికిపోతోంది. కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా ఈ కరోనా బూచి  శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది ఉంటుంది. ఇక ఇప్పటికే ఈ వైరస్ ప్రపంచంలోనే 150 దేశాలకు వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారతదేశానికి కూడా వ్యాపించి ఉంది  ఈ ప్రాణాంతకమైన వైరస్ . భారత్ లోని  పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ విజృంభిస్తోంది. దీంతో అప్రమత్తమైపోయిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ కఠిన నిబంధనలు అమలులోకి తెస్తోంది. 

 

 అయితే ఈ ప్రాణాంతకమైన వైరస్ ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నో కఠిన నిబంధనలను తెరమీదికి తెచ్చి అమలు చేస్తుంది కెసిఆర్ సర్కార్. ఈ నేపథ్యంలోనే కరోనా  వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు... రాష్ట్రంలోనే విద్యాసంస్థలు, సినిమా హాల్లో, పార్కులు, పబ్బులు... ఇలా అన్ని పబ్లిక్ ప్లేస్ లు  అన్నింటిని మూసి వేయాలంటూ తెలంగాణ సర్కార్ కఠిన నిబంధనలు అమలులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. కరోనా  వైరస్ నియంత్రణకు అందరూ సహకరించాలి అంటూ కోరింది తెలంగాణ సర్కార్. 

 

 

 ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కోచింగ్ సెంటర్లు కూడా మూత పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్ ఉన్న ప్రాంతాల్లో పలు కోచింగ్ సెంటర్ ను కూడా మూసివేయాలి అంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిబంధనలకు  విరుద్ధంగా ఓపెన్ చేసి ఉన్న కోచింగ్ సెంటర్ లను  జిహెచ్ఎంసి అధికారులు సీజ్ చేస్తున్నారు. ఈనెల 31 వరకు... రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు,  హాస్టళ్లు,  కోచింగ్ సెంటర్లు,  స్విమ్మింగ్ పూల్స్.. బార్లు ప్రభుత్వ  నిబంధనలకు విరుద్ధంగా తెరిచి ఉంచితే.. లైసెన్సులను రద్దు చేస్తామంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా తెరచి ఉంచిన 98 సంస్థలను సీజ్ చేశారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: