పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరుతూ ఇటీవ మొదలైన గోళ ఢిల్లీలో ప్రకంపణలు సృస్టించిన విషయం తెలిసిందే.  దాదాపు నలభై మందికి పైగా మరణాలు.. వందల మంది ఆసుపత్రి పాలు.. వందల కోట్ల నష్టం.  ఇప్పుడిప్పుడు కాస్త అక్కడ కుదుట పడుతుంది.  ఇంతలోనే మరో ఉపద్రవం.. కరోనా వైరస్ అటాక్.   కరోనా ఎఫెక్ట్ వల్ల వేల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు.  వాణిజ్య వ్యవస్థపై కూడా కరోనా ప్రభావం తీవ్రంగా పడుతుంది. తాజాగా సీఏఏ కి వ్యతిరేకంగా చెన్నై విధుల్లో ఆందోళన జరిగింది. మార్గమధ్యంలో బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా మోహరించిన పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తలకు మధ్య వాదోపవాదాలు జరిగాయి.  

 

ఈ మద్య తెలంగాణ అసెంబ్లీలో సీఏఏపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్. అంతే కాదు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానానికి ఆమోదం తెలిపింది. సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ అనంతరం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.  ప్రస్తుతం కరోనా వైరస్ గొల ఉండగానే.. ఒకే చోట గుమికూడవద్దంటూ ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా సీఏఏ నిరసనకారులు పట్టించుకోలేదు. చెన్నై వీధుల్లో దాదాపు 5వేల మంది సీఏఏని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు.

 

సీఏఏను ఉపసంహరించుకోవాలని మెరీనా బీచ్ సమీపంలోని చేపాక్ ప్రాంతంలో వీరు నినాదాలు చేశారు. నిరసనకారులంతా తౌహీత్ జమాత్ సంస్థకు చెందినవారు. చేపట్టిన నిరసనల పట్ల స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం నిరసనలు చేయవొద్దని.. దేశంలో పరిస్థితి బాగాలేదని.. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువ ఉందని.. ఆరోగ్యం రక్షించుకోవాలంటే ఇలాంటివి చేయకుండా ఉండాలని  నిరసనలు, ఆందోళనలు చేపట్టడానికి ఇది సరైన సమయం కాదని అంటున్నారు. తాజాగా కరోనా వల్ల దేశంలో ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: