జీవితంలో కష్టాన్ని నమ్ముకుంటే ఆలస్యంగానైనా విజయం సొంతమవుతుంది అనడానికి ఉదాహరణ లింజా ఆర్జే. కేరళకు చెందిన ఈ మహిళ జీవిత చరిత్ర గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వడంతో పాటు ఆశ్చర్యపోవాల్సిందే. 39 ఏళ్ల లింజా ఆర్జే గత 12 సంవత్సరాలుగా స్వీపర్ గా పాఠశాలలో విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈమె ఇదే స్కూల్ లో ఇంగ్లీష్ టీచరైంది. లింజా తండ్రి రాజన్ ఇదే స్కూల్ లో గతంలో పని చేశాడు. 
 
లింజా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆమె తండ్రి మరణించాడు. ఆ సమయంలో ఆమె ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయగా పాఠశాలలో స్వీపర్ గా ఉద్యోగం వచ్చింది. కుటుంబ అవసరాలు, తమ్ముడిని చదివించాల్సి ఉండటంతో ఆమె స్వీపర్ ఉద్యోగంలో చేరింది. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ఆమె పోస్ట్ పోయింది. స్కూల్లో పని చేస్తున్న సమయంలో ఆమె బీఏ, ఎం.ఏ, బీఈడీ పాస్ అయింది. 
 
మరలా ఆమెకు అదే స్కూల్ లో స్వీపర్ పోస్టులో జాయిన్ కావాలని పిలుపు వచ్చింది. అవసరాల దృష్ట్యా ఆమె స్వీపర్ గా చేరింది. స్వీపర్ ఉద్యోగం చేస్తూనే టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ రాసింది. స్కూల్ ప్రిన్సిపాల్ ప్రవీణ ప్రోత్సాహంతో స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ కూడా రాసింది. ఆ టెస్ట్ లో కూడా పాస్ కావడంతో అదే స్కూల్ లో లింజాకు ఇంగ్లీష్ టీచర్ గా ఉద్యోగం వచ్చింది. 
 
ఒకప్పుడు స్వీపర్ గా పని చేసిన పాఠశాలలోనే ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ గా ఉద్యోగం రావడంతో లింజా ఎంతో సంతోషపడుతున్నారు. పాఠశాలలో ఈమె ఇంగ్లీష్ లో తప్ప మరో భాషలో మాట్లాడదు. పిల్లలు కూడా పాఠశాలలో ఇంగ్లీష్ లోనే మాట్లాడించటానికి లింజా కృషి చేస్తోంది. ఒకప్పుడు స్వీపర్ గా పని చేసిన లింజా ఇంగ్లీష్ టీచర్ కావడానికి పడిన కృషిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: