ప్రస్తుతం ప్రపంచ దేశాలను ప్రాణభయంతో బెంబేలెత్తిస్తు... ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకున్న మహమ్మారి వైరస్ కరోనా. మొన్నటి వరకు చైనా దేశానికి మాత్రమే పరిమితమైన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు కూడా శరవేగంగా వ్యాప్తిచెందుతూనే . దీంతో ప్రపంచ దేశాలు ప్రాణభయంతో చిగురుటాకులా వణికిపోతున్నాయి . అయితే కరోనా  వైరస్ ను నియంత్రించేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం మాత్రం పెరిగిపోతున్నది . ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు పైగా ఈ మహమ్మారి వైరస్ వ్యాపించిన  విషయం తెలిసిందే. 

 

 

 ఈ క్రమంలోనే భారత దేశానికి కూడా వ్యాపించి... రోజురోజుకు ప్రజల్లో భయాందోళనలు పెంచుతుంది ఈ మహమ్మారి వైరస్ . ఇప్పుడు వరకు ఏకంగా  భారతదేశంలో 150 కరోనా పాజిటివ్ కేసులు  నమోదైన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇక ఎంతో మంది అబ్జర్వేషన్ లో  కూడా ఉన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు భారతదేశంలో కఠిన నిబంధనలు అమలు లోకి వస్తుంది. అటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల సంక్షేమం కోసం.. కరోనా  వైరస్ ను నియంత్రించేందుకు అవగాహన చర్యలు చేపట్టడంతో పాటు ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా చేపడుతున్నాయి.

 

 

 అయితే ఇప్పుడు వరకు దేశంలో కరోనా వైరస్ వ్యాపించిన రాష్ట్రాల్లో  ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కూడా ఒకటి. ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పదికి పైగా కరోనా  కేసులు  నమోదైన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకు శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఇప్పటికే విద్యా సంస్థలు అన్నింటినీ మూసీవేస్తూ నిర్ణయం తీసుకున్న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం... ఇక ఈ విద్యా సంస్థల సెలవులని  ఏకంగా ఏప్రిల్ 2 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రెండవ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న  విద్యార్థులు.. ఎలాంటి పరీక్షలు రాయకుండానే పై  తరగతులకు పంపేందుకు కీలక నిర్ణయం  తీసుకుంది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగే అన్ని పోటీ పరీక్షలను కూడా ఏప్రిల్ రెండు వరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: