స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైసిపి ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండుంటే సరిపోయేదేమో ? ఏమాత్రం జాగ్రత్త పడున్నా ఇపుడింత కంపు జరిగేది కాదని వైసిపి నేతలే అంగీకరిస్తున్నారు.  ఇంతకీ వైసిపి చేసిన కంపు ఏమిటి ?  ఏమిటంటే నామినేషన్ల పర్వంలో కొందరు వైసిపి నేతలు కొన్ని నియోజకవర్గంలో చేసిన ఓవర్ యాక్షన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎవరో కొందరు చేసిన ఓవర్ యాక్షనే ఇపుడు జగన్మోహన్ రెడ్డికి అంటుకుంది.

 

ఇంతకీ కొందరు నేతలు చేసిన ఓవర్ యాక్షన్ ఏమిటంటే ప్రత్యర్ధులను నామినేషన్లు కూడా వేయనీయక పోవటమే. పుంగనూరు, పీలేరు, మాచర్ల, గురజాల లాంటి నియోజకవర్గాల్లో  ఎంపిటిసి, జడ్పిటిసి స్ధానాలకు నామినేషన్ల వేసేటపుడే చాలా గొడవలు జరిగాయి.  నామినేషన్లు వేయటానికి వచ్చిన ప్రత్యర్ధులను రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లోనే అడ్డుకోవటం, నామినేషన్లు చింపేయటం, దాడి ఘటనలు జరిగాయి.

 

నిజానికి జరిగిన ఘటనలు తక్కువే అయినా తెలుగుదేశంపార్టీ నేతలు జరిగిన ఘటనలను చాలా పెద్దగా చూపించింది. అదే సమయంలో వైసిపి నేతలేం చేశారంటే పనిలో పనిగా బిజెపి, జనసేన నేతలపైన కూడా దాడులు చేశారు. అసలు బిజెపి నేతలకు అన్నీ చోట్ల నామినేషన్లు వేసేందుకు మనుషులే లేరు. ఒకవేళ వేసినా పడే ఓట్లు లేవు. ఇంతోటి దానికి బిజెపి నేతలను కూడా నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవాల్సిన అవసరం లేదు. మరి వైసిపి నేతలు కమలం పార్టీ వాళ్ళని కూడా అడ్డుకోవటం ఓవర్ యాక్షన్ కాకపోతే మరేమిటి ?

 

అసలు నామినేషన్లు వేయకుండా ఎవరు ఎవరిని అడ్డుకున్నా తప్పే. ఒకవేళ ఎక్కడైనా అడ్డుకున్నారని అనుకున్నా అదేదో  టిడిపి నేతల వరకే పరిమితమై ఉంటే సరిపోయేది. అప్పుడు గొడవలేవో వైసిపి-టిడిపి నేతల మధ్యే ఉండేది కాబట్టి బిజెపి నేతలు పట్టించుకునే వాళ్ళు కాదు. వైసిపి నేతలు ఎప్పుడైతే బిజెపి నేతల మీద కూడా పడ్డారో అప్పుడే విషయం పార్టీ నేతల ద్వారా కేంద్ర హోంశాఖ దాకా వెళ్ళింది. అలాగే జరిగిన గొడవలన్నింటినీ ఎలక్షన్ కమషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా తాజాగా కేంద్ర హోంశాఖ కార్యదర్శికి వివరంగా లేఖ రాశాడు.  అంటే ఎక్కడో కొందరు వైసిపి నేతలు చేసిన ఓవర్ యాక్షన్ కు జగన్ సమాధానం చెప్పుకోవాల్సొస్తోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: