ముఖ్యమంత్రి కేసిఆర్ రాజకీయ వారసురాలు  నిజాంబాద్ మాజీ ఎంపీ కవిత రాజకీయ భవితవ్యంపై గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి కేసిఆర్ రాజకీయ వారసురాలు గతంలో పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజకీయాల్లో అంతగా యాక్టివ్ లేరు అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన  రాజ్యసభ స్థానాలు ఎమ్మెల్సీ స్థానాల్లో  కవితకు ఏ పదవి కేటాయిస్తారు  అనేదానిపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ కవితకు ఓ రాజ్యసభ స్థానాన్ని కేటాయించి  రాజ్యసభకు పంపుతారు అనే చర్చ కూడా ఎన్నో రోజుల పాటు జరిగింది. 

 

 

 ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న పార్టీ అధిష్టానం రాజ్యసభ స్థానాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ రాజ్యసభ స్థానాలను కవితకు కేటాయించకపోవడంతో ఎమ్మెల్సీ కేటాయించడం ఖాయమని అర్థమైపోయింది. అయితే కవిత ను రాజ్యసభకు పంపకుండా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి... ప్రత్యక్ష రాజకీయాల్లో భాగం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ ఎంపీ కవిత ఎమ్మెల్సీ నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ కవిత పై కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. కవిత రాష్ట్ర నాయకురాలని ఆమె సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరం అంటూ jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

 

 

 కవిత కేవలం నిజాంబాద్ కు మాత్రమే పరిమితం కావద్దు అంటూ  ఎమ్మెల్సీ jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ పార్టీకి కవిత సేవలు ఎంతో అవసరమని... అందుకే కవితకు ఎమ్మెల్సీగా బాధ్యతలు ఇచ్చారు అంటూ జీవన్ రెడ్డి  ఈ సందర్భంగా తెలిపారు. గతంలో పార్లమెంటు ఎన్నికల్లో కవిత ఓటమి తనను ఎంతో బాధించిందని తెలిపిన జీవన్ రెడ్డి... రాజకీయాలు అన్న తర్వాత గెలుపోటములు సహజం అన్నారు. ఓడిపోయినప్పుడు నేతల్లో  మరింత బాధ్యత పెరుగుతుంది అంటూ వ్యాఖ్యానించిన జీవన్ రెడ్డి... కవిత కు ఏ పదవి ఇచ్చినా సక్సెస్ అవుతారు పేర్కొన్నారు. అయితే కవితకు ఎమ్మెల్సీ పదవి కేటాయించి మంత్రిని చేస్తారా అనే దానిపై కూడా ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: