ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు మరీ ఇంత శాడిస్టని ఎవరూ ఊహంచలేదు. తాను అధికారంలో ఉన్నపుడు సర్వ వ్యవస్ధలను భ్రష్టుపట్టించే చంద్రబాబు చివరకు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అవే వ్యవస్ధలను అడ్డం పెట్టుకుని రాష్ట్రాభివృద్ధిని నాశనం చేస్తున్నాడు. మొన్నటి ఎన్నికల్లో  ప్రజలు చీ కొట్టి అధికారంలో నుండి దింపేసిన తర్వాత చంద్రబాబులో శాడిజం బాగా పీక్స్ కు చేరుకున్నట్లే అనుమానంగా ఉంది. అందుకనే కేంద్రం నుండి రావాల్సిన వేల కోట్ల రూపాయలను అడ్డుకున్నారు.

 

తాను అధికారంలో ఉండగానే అంటే 2018, జూలైలోనే నిర్వహించాల్సిన స్ధానిక సంస్ధల ఎన్నికలను ఏవేవో సాకులతో జరపకుండా కాలక్షేపం చేశాడు. ఇపుడు నానా అవస్తలు పడి ఎన్నికలు జరుపుదామని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలను కూడా చంద్రబాబు అడ్డుకున్నారు.  కోర్టుల్లో కేసుల మీద కేసులు వేయించి  ఎన్నికల ఆలస్యానికి చంద్రబాబే కారణమని అందరికీ తెలిసిందే. ఏదో ఓ పద్దతిలో అన్నింటిని అధిగమించి ఎన్నికల నిర్వహణకు రెడీ అయితే చివరకు మధ్యలోనే ప్రక్రియను అడ్డుకున్నాడు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అధికారంలో ఉంటే న్యాయం, ధర్మం, చట్టం, రాజ్యాంగం ఏవీ చంద్రబాబుకు గుర్తుకు రావు. ప్రతిపక్షాలు అవసరం లేదు. అఖిలపక్షాలు నిర్వహించాల్సిన అవసరమే రాదంటారు. అదే ఖర్మకాలి ఓడిపోతే వెంటనే న్యాయం, ధర్మం, రాజ్యాంగం, చట్టం, మానవతా ధర్మం అన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చేస్తాయి.  రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను జగన్ బెదిరించారంటూ చంద్రబాబు నానా యాగీ చేస్తున్నదీ అందరూ చూస్తున్నదే.

 

అదే మొన్నటి ఎన్నికల సమయంలో సెంట్రల్ ఎలక్షన్ కమీషనర్ గోపాలకృష్ణ ద్వివేది కార్యాలయానికి వెళ్ళి మరీ చంద్రబాబు ఏ స్ధాయిలో బెదిరించారో అందరూ చూసిందే. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్ చంద్ర పునేఠ, ఇంటెలిజెన్స్ డిజి ఏ బి వెంకటేశ్వరరావు ను బాధ్యతల నుండి తప్పిస్తే ఏకంగా కేంద్ర ఎన్నికల కమీషన్ గురించి ఎంత నీచంగా మాట్లాడింది అందరికీ గుర్తుండే ఉంటుంది. మొత్తానికి మొన్నటి ఎన్నికల దెబ్బకు చంద్రబాబులో శాడిజం బాగా డెవలప్ అయిపోయిన విషయం అర్ధమైపోతోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: