స్ధానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ప్రకటన ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే. అసలు రాష్ట్రప్రభుత్వంతో సంప్రదించకుండానే స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేసేంత ధైర్యం ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎక్కడి నుండి వచ్చింది ?  ఎక్కడి నుండి అంటే ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం శనివారం రాత్రి కేంద్రంలోని ఓ కీలక మంత్రితో ఫోన్లో నిమ్మగడ్డతో  మాట్లాడినట్లు సమాచారం.

 

కేంద్రమంత్రి ఎందుకు మాట్లాడారంటే బిజెపి ఎంపిలు జివిఎల్ నరసింహారావు, సిఎం రమేష్, టిజి వెంకటేష్  మంత్రికి ఫిర్యాదు చేశారు. బిజెపి+జనసేన పార్టీలకు చెందిన నేతలను నామినేషన్లు వేయనీయకుండా వైసిపి నేతలు అడ్డుకోవటం, నామినేషన్లు వేసిన వారిని పోలీసుల సాయంతో ఉపసంహరించుకోవాలంటూ బెదిరిస్తున్నట్లు ఫిర్యాదు చేశారని సమాచారం. నామినేషన్లు వేసిన జనసేన+బిజెపి నేతలపై ప్రభుత్వమే ఒత్తిళ్ళు తెస్తున్నట్లు  ఫిర్యాదు చేశారు.

 

అప్పటికే చంద్రబాబునాయుడు చేస్తున్న ఆరోపణలు, చూపిస్తున్న వీడియో క్లిప్పుంగులను కూడా సదరు మంత్రికి ఎంపిలు చూపారట. దాంతో శనివారం మంత్రి నిమ్మగడ్డతో నేరుగా ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. వాళ్ళిద్దరి సంభాషణల్లోనే ఎన్నికల వాయిదాను కేంద్రమంత్రి సూచించారట. స్వయంగా కేంద్రమంత్రే ఎన్నికలను వాయిదా వేయమని చెప్పిన తర్వాత నిమ్మగడ్డకు ఎక్కడలేని ధైర్యం వచ్చింది. అందుకనే ఆదివారం ఉదయానికల్లా కరోనా వైరస్ ప్రభావం సాకుతో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

 

నిమ్మగడ్డకు కలిసివచ్చిన విషయం ఏమిటంటే చంద్రబాబు కూడా ఇదే పద్దతిలో డిమాండ్ చేస్తుండటం. అంటే ప్రధాన ప్రతిపక్ష నేతతో పాటు కేంద్రమంత్రి కూడా  పూర్తి మద్దతు ఉండటంతో  నిమ్మగడ్డ ధైర్యం చేశాడు. ఎలాగూ జగన్మోహన్ రెడ్డి తనను చేయగలిగేది ఏమీ లేదని నిమ్మగడ్డకు బాగా తెలుసు. కాబట్టి ఎన్నికల ప్రకటన విషయంలో అసలు రాష్ట్రప్రభుత్వాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు. మొత్తానికి తనకున్న గట్టి మద్దతుతోనే రాష్ట్రప్రభుత్వంతో యుద్ధానికి నిమ్మగడ్డ దిగటం సంచలనమే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: