చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీని నారా లోకేశ్ నడిపిస్తారని తెలుగు తమ్ముళ్ళు ఫిక్స్ అయిపోయిన విషయం తెలిసిందే. అయితే నారా లోకేశ్ నాయకత్వంపై తెలుగు తమ్ముళ్ళకు పెద్దగా నమ్మకం లేదు. చంద్రబాబు మాదిరిగా ఆయన పార్టీని నడిపించలేరని అనుకుంటారు. అటు ప్రత్యర్ధి పార్టీగా ఉన్న వైసీపీ కూడా లోకేశ్‌ని పెద్ద నాయకుడుగా చూడదు. రాజకీయం చేసేంత సీన్ లోకేశ్‌కు లేదని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అసలు లోకేశ్‌పై ఇటు సొంత పార్టీలో గానీ, అటు ప్రత్యర్ధి వైసీపీలో గానీ పెద్దగా అంచనాలు లేవు.  

 

అయితే లోకేశ్ పైకి కనిపించకపోయిన, తెరవెనుక ఉండి బాగానే రాజకీయాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు లోకేశ్ చాలానే చేశారని అర్ధమవుతుంది. ఆయన ఏం చేశాడో ఒక్కొక్కటిగా వైసీపీ అధికారంలోకి వచ్చాక బయటపడుతూనే ఉన్నాయి. ఇక తాజాగా కూడా లోకేశ్ తెరవెనుక నడిపించిన ఓ పోలిటికల్ గేమ్ బయటపడింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఇటీవల వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.

 

ఈయన వైసీపీలో చేరాక చంద్రబాబుపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. తాజాగా కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఓ విషయాన్ని బయటకు చెప్పారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించడానికి ఎంపీటీసీలని డబ్బుతో కొనాలని లోకేష్ తమకు చెప్పారని అన్నారు. బీటెక్ రవిని గెలిపించడానికి, కడప జిల్లాలో వైసీపీకి అత్యధిక సంఖ్యలో ఎంపీటీసీలు ఉన్నప్పట్టికీ డబ్బుతో కొని వివేకాను ఓడించారని రామసుబ్బారెడ్డి కథ మొత్తం చెప్పారు.

 

ఇక దీని బట్టి చూస్తే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేశ్ చాలానే చేశారని అర్ధమవుతుంది. మొత్తానికైతే చినబాబు పెద్ద ముదురులాగానే కనిపిస్తున్నారు. తెర వెనుక చాలానే కథలు నడిపించారు. అందుకే అనుకుంటా 2019 ఎన్నికల్లో టీడీపీకి అదిరిపోయే ఫలితాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: