రాజకీయ నాయకులంటే గోడమీద పిల్లులనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందట.. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీ జండా మోయడానికి సిద్దపడతారు నాయకులు అని అందరు అనుకుంటున్నారు.. ఈ మాటలను నిజం చేస్తూ ఓ ఘటన జరిగింది.. అదేమంటే..

 

 

నడింపల్లి వెంకట శివరామకృష్ణంరాజు గారు ఇన్నాళ్లుగా పసుపు కండువాను మోసి.. ఇప్పుడు బరువుగా మారిందని దాన్ని వదిలించుకుని.. వైసీపీ జండాను చేత పట్టాడని తెలుసు కదా.. ఇతను చేసిన పనికి టీడీపీ నాయకులు మండి పడుతున్నారట.. ఏమయ్య శివరామకృష్ణంరాజు తోటి నాయకులను కాదని నువ్వేదో తోపని నమ్మి సీటు ఇస్తే ఇంత మోసం చేస్తావా.. కుంటిసాకులు చెబుతూ వైసీపీలో చేరతావా అంటూ మాటలతో కుళ్లబొడుస్తున్నారట..

 

 

ఈ విషయంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గణపతి నీడి రాంబాబు.. పండిత విల్లూరులో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, టీడీపీ.. కృష్ణంరాజుకు జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తే, మోసం చేసి వైసీపీలో చేరడం హీనాతి హీనమని పేర్కొన్నారు.. ఇకపోతే వైసీపీలో చేరిందే కాకుండా దానికి కల్లబొల్లి కబుర్లు చెబుతు ఉండటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

 

 

ఇకపోతే టీడీపీ నాయకులను తమవైపు తిప్పుకునేందుకు వైసీపీ నాయకులు అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని, మండల టీడీపీ అధ్యక్షుడు గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.. అంతే కాకుండా అక్రమ కేసులు బనాయించాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని, మా హక్కులకు ఏమాత్రం భంగం వాటిల్లిన ఉద్యమిస్తామని, టీడీపీ నాయకులు హెచ్చరించారు.

 

 

ఇక ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.. ఇకపోతే రాజకీయాలంటే తెలియంది ఎవరికి.. రాత్రికి చెప్పిన మాట పొద్దున గుర్తుకు ఉండదంటారు మన నాయకులు.. ఇలాంటి వారికి పదవులు కావాలి గానీ ప్రజల బాగోగులు ఎందుకు అని కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: