వైసీపీ ఆపరేషన్‌లో భాగంగా చాలామంది టీడీపీ నేతలు చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చిన విషయం తెలిసిందే. వరుస పెట్టి టీడీపీ నేతలు వైసీపీ కండువా కప్పేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కరణం బలరాం కూడా జగన్ వైపు వచ్చేశారు. అలాగే జిల్లాలో మరికొందరు నేతలు కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. రేపో మాపో గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావులు కూడా వైసీపీలోకి వెళ్లిపోవచ్చని ప్రచారం జరుగుతుంది.

 

ఇక వీరు కూడా వెళ్లిపోతే జిల్లాలో టీడీపీకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. జిల్లా అధ్యక్షుడుగా దామచర్ల జనార్ధన్ ఉన్న, ఆయనకు పెద్దగా జిల్లాపై పట్టు లేకపోవడం వల్ల పార్టీకు డ్యామేజ్ జరిగే అవకాశముంది. అయితే ఇదే సమయంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు ఉన్న క్రేజ్ వల్ల టీడీపీకి కాస్త ఊరట లభిస్తుంది. రెండోసారి పర్చూరు నుంచి గెలిచిన ఏలూరికు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన చేసే సామాజిక కార్యక్రమాలు వల్ల జిల్లాలో మంచి పేరుంది.

 

పైగా ఇటీవల జాతీయ ఆదర్శ యువ ఎమ్మెల్యే అవార్డు తీసుకున్నాక, ఏలూరి ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఇక ఇదే ఫాలోయింగ్‌తో ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఏలూరి లీడ్ చేయొచ్చు. కరణం బలరాం మాదిరిగానే ఏలూరికి తన సొంత నియోజకవర్గంతో పాటు ప్రకాశం జిల్లాలో ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది.  అయితే ఇప్పుడు కరణం పార్టీ మారడం వల్ల, ఏలూరికి మంచి అవకాశం దొరికినట్లైంది.

 

ఆయనకు జిల్లాపై పూర్తి గ్రిప్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. జిల్లా అధ్యక్షుడుగా దామచర్ల ఉన్న, ఏలూరికి కాస్త జిల్లాపై పట్టు వచ్చేలా టీడీపీ అధిష్టానం చేయగలిగితే, భవిష్యత్‌లో మంచి ఫలితాలు రాబట్టే అవకాశముంటుంది. మొత్తానికైతే ఏలూరి లీడింగ్ తీసుకుంటే జిల్లాలో టీడీపీకి కాస్త అనుకూల వాతావరణం రావోచ్చని తెలుగు తమ్ముళ్ళు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: