జి‌వి‌ఎల్ నరసింహారావు...ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టే, సెంట్రల్ బీజేపీ నేత. అవ్వడానికి తెలుగు వ్యక్తి అయిన, కేంద్ర బీజేపీ పార్టీలో కీలక పాత్ర పోషించే నాయకుడు. రాజ్యసభ ఎంపీగా ఉన్న ఈయన, బీజేపీతో టీడీపీ పొత్తు విడిపోయాక, ఏ స్థాయిలో చంద్రబాబుపై విమర్శలు చేశారో, వార్నింగ్‌లు ఇచ్చారో కూడా ఏపీ ప్రజలకు బాగా తెలుసు. ఓ రకంగా చంద్రబాబు ఓటమిని చూసే వరకు ఆయన నిద్రపోయి పోలేదు.

 

సరే ఆయన అనుకున్నట్లుగానే చంద్రబాబు ఓడిపోయారు. జగన్ అధికారంలోకి వచ్చారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక, జి‌వి‌ఎల్, జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎప్పుడు మాట్లాడలేదు. రాష్ట్ర బీజేపీ నేతలు జగన్‌పై విమర్శలు చేసిన జి‌వి‌ఎల్ మాత్రం చంద్రబాబుపైనే విమర్శలు చేశారు. ఆఖరికి రాష్ట్ర బీజేపీ నేతలు మూడు రాజధానులు, మండలి రద్దు నిర్ణయాల్ని వ్యతిరేకిస్తే, జి‌వి‌ఎల్ మాత్రం జగన్ తీసుకున్న నిర్ణయాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదని తేల్చి చెప్పేశారు.

 

అయితే మొన్నటివరకు ఈ విధంగా జగన్‌కు కాస్త అనుకూలంగా మాట్లాడినా జి‌వి‌ఎల్, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రక్రియ మొదలవ్వడమే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. నామినేషన్ల సమయంలో తమ అభ్యర్ధులపై వైసీపీ నేతలు దాడులు చేశారని చెబుతూ, హోమ్ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఇక ఆ ఫిర్యాదు తర్వాత కరోనా ప్రభావం ఎక్కువ ఉందని చెబుతూ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ స్థానిక ఎన్నికలని వాయిదా వేశారు. ఇక దీనిపై జగన్ ప్రభుత్వం సుప్రీంకు వెళ్ళిన, ఎన్నికల సంఘానికి అనుకూలంగానే తీర్పు వచ్చింది.

 

ఈ క్రమంలోనే జి‌వి‌ఎల్ మరోసారి జగన్ ప్రభుత్వం టార్గెట్‌గా కొన్ని కామెంట్లు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సక్రమంగా జరిగితే వైసీపీ, టీడీపీలకు బీజేపీ-జనసేన పార్టీలు గట్టి పోటీ ఇస్తాయని, భవిష్యత్తులో తమ పొత్తు ఎలా ఉండబోతోందనే దానిపై ఈ ఎన్నికల్లో ఓ ట్రైలర్ చూపిస్తామని అన్నారు. అయితే ఇక్కడ టీడీపీని పక్కనబెట్టేస్తే, బీజేపీ-జనసేనలకు వైసీపీకి పోటీ ఇచ్చేంత సీన్ ఉందా? లేదా తమకున్న అధికారాలతో జగన్‌ని ఏమన్నా ఇబ్బంది పెట్టి భవిష్యత్‌లో ఏపీలో అధికారం చేజిక్కించుకోగలమనే కాన్ఫిడెన్స్ జి‌వి‌ఎల్‌కు ఉందా అనేది తెలియడం లేదు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో జి‌వి‌ఎల్ పాత్ర ఎలా ఉంటుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: