తెలంగాణ రాష్ట్రం వచ్చాక, ఆ వెంటనే జరిగిన 2014 ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలోని టి‌ఆర్‌ఎస్ మెజారిటీ సీట్లు తెచ్చుకుని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులని  లాగేసుకుని, ప్రతిపక్షాల ఉనికినే దెబ్బ కొట్టారు. కేసీఆర్ దెబ్బకు తెలంగాణలో టీడీపీ తుడిచి పెట్టుకుని పొగా, కాంగ్రెస్ ఏదో అలా అలా ఉంది. అయితే ప్రతిపక్షాలని వీక్ చేసిన కేసీఆర్, ప్రభుత్వం పరంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలని కూడా బాగానే అమలు చేశారు.

 

అందువల్లే ప్రజల్లో వ్యతిరేకిత ఏ మాత్రం రాకుండా రెండో సారి అంటే 2018 ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో అధికారంలోకి రాగలిగింది. అయితే అప్పుడు కేసీఆర్ అమలు చేసిన సూత్రాన్నే, ఇప్పుడు ఏపీలో జగన్ కూడా అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.  జగన్ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలపై ఎక్కువ దృష్టి పెట్టి, వాటిని అమలు చేసుకుంటూ వస్తున్నారు. అలాగే అభివృద్ధిలో భాగంగా మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకొచ్చారు.

 

ఇక వీటితో పాటు, ప్రతిపక్ష టీడీపీని వీక్ చేసే పనిలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు తెరపైకి రాగానే, వరుస పెట్టి టీడీపీ నేతలని చేర్చుకోవడం మొదలుపెట్టారు. ఎన్నికలు వాయిదా పడిన ఈ వలసల కార్యక్రమాన్ని ఆపలేదు. అయితే ఈ క్రమంలోనే జగన్ దెబ్బకు ఒక్కో జిల్లాలో టీడీపీ కనుమరుగయ్యే స్థితికి వచ్చేసింది. ఇప్పటికే సీఎం జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీ అడ్రెస్ గల్లంతు అయింది.

 

అలాగే కర్నూలు జిల్లాలో కూడా టీడీపీక్కి దిక్కులేకుండా పోయింది. ఇక ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా టీడీపీని దెబ్బ తీసే పనిలో ఉన్నారు. మళ్ళీ 2024 ఎన్నికల నాటికి ఎక్కువ జిల్లాల్లో టీడీపీ మనుగడ లేకుండా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఇలా చేయడం వల్ల 2024లో కూడా సీఎం పీఠం జగన్ సొంతమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: