ఏ రాష్ట్రాన్ని తీసుకున్న రాజకీయం ఒక్కటే.. ఇందులో ఉన్న నాయకుల మనస్తత్వాలు ఒక్కటే.. ప్రజలకు మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను.. ఇది కామన్ డైలాగ్‌లా మారిపోయింది.. ఎందుకంటే ప్రతి వారు అరిగిపోయిన గ్రాం ఫోన్‌లా ఈ మాటలు చెప్పి చెప్పి ప్రజల ఓపికను పరిశీలిస్తున్నారు.. ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తున్నాడంటే అది అతని స్వలాభం కోసమే గానీ, ప్రజలకు ఏదో మంచి చేయాలని మాత్రం కాదన్న విషయం అందరికి తెలిసిందే.. ఇక తెలుసని నాయకుడు ఈ మాట అనకుండా ఉండడు.. అలాగని ప్రజలు వినకుండా ఉండరు..

 

 

ఇకపోతే ఈ రాజకీయాల్లో రాచకీయాలు చాలా జరుగుతాయట.. అదేలా అంటే ఇదివరకు ఎందరో రాజకీయ నేతలు ఒక మాట అన్నారు. ఈ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఉండరు అని.. ఇది నిజమే రాజకీయ నాయకునికి, రాజకీయ నాయకునితోనే ఎప్పటికి పని.. ఓటరుతో మాత్రం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి పని.. అందుకే నాయకులు నాయకున్నే నమ్ముతారు.. ఈ ప్రజలు ఎంత గోచీ గాళ్లని అనుకుంటారట.. ఇక ఆత్మ పరిశీలన చేసుకుంటే ఒక్కడైనా నిజాయితీ గల రాజకీయనేత కనిపించడు.. ఒకవేళ ఇలా ఉండాలనుకుంటే అతనికి పదవి ఉండదు.. పని ఉండదు.. ఇక ఇప్పటి వరకు తెలంగాణలో తెలుగుదేశం, కాంగ్రెస్ జెండాల మీద గెలిచిన వారు గులాబీ కండువా కప్పుకున్నారు.

 

 

ఆ తర్వాత కొందరు కాషాయ కండువాల్లోకి మారిపోయారు. ఇవన్నీ చూస్తుంటే ఇంత స్వార్థం, ఇంత ఆత్మవంచనతో రాజకీయాలు నిండిపోతే సామాన్యుడు సమిధ అవక ఏమవుతాడు అని అనిపించక మానదు.. నేటికాలంలో నాయకుల్లో మాట మీద నిలబడటం, మాటకు కట్టుబడటం, శాశ్వత విలువలతో బతకటం అనేది అరుదై పోయింది. అందుకే పదవి ఉంటే పంచన చేరుతారు.. అదే లేదంటే దరిదాపుల్లోకి కూడా రారు.. ఇక రాజకీయాలకు నిదర్శనంగా సీఎం జగన్‌ను తిట్టిన వారే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు.. ఇలా అన్న వారే గతంలో తిట్టారు. ఇంద్రుడు చంద్రుడు అని చంద్రబాబును గతంలో అన్న వారే నేడు తిడుతున్నారు. కేసీఆర్‌ను తిట్టిన వారే పొగుడుతున్నారు. ఇలా పొగడ్తలు, తెగడ్తలు చేసే వాళ్ల కంటే దీపం చుట్టూ చేరే పురుగులే గుర్తొస్తున్నాయి అని అనుకుంటున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: