ప్ర‌పంచాన్ని హ‌డలెత్తిస్తోన్న క‌రోనా వైర‌స్ భార‌త్‌లో ఇప్పుడు రెండో ద‌శ‌కు వ‌చ్చేసింది. ఇప్పుడు ఈ వైర‌స్ నేప‌థ్యంలో ప్ర‌పంచంలో ఏ దేశంలో ఏ మీడియాలో చూసినా.. ఛానెల్స్‌. సోష‌ల్ మీడియాలో సైతం క‌రోనా వార్త‌లు హ‌డ‌లెత్తిం చేస్తున్నాయి. ఇక ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా 163 దేశాల‌కు పాకిన క‌రోనా వైర‌స్ వ‌ల్ల 2 లక్ష‌ల మంది బాధ ప‌డుతున్నారు. ఇప్ప‌టికే 8 వేల మంది చ‌నిపోయారు. మ‌న దేశంలో క‌రోనా బాధితుల సంఖ్య 150 క్రాస్ అవ్వ‌గా.. అధికారిక లెక్క‌ల ప్ర‌కారం ఈ వైర‌స్ వ‌ల్ల చ‌నిపోయింది ముగ్గురు. 

 

ఇక తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే ఏపీలో ఒక క‌రోనా పాజిటివ్ రాగా.. తెలంగాణ‌లో క‌రోనా బాధితులు ఆరుకు చేరుకున్నారు. ఇక క‌రోనా వైర‌స్ ఎక్క‌డ ?  ఎలా ?  ఎంత సేపు బ‌తికి ఉంటుంది ? అన్న‌ది ప‌రిశీలిస్తే ఆస‌క్తికర అంశాలే క‌నిపిస్తున్నాయి. గాల్లో ఎక్కువ దూరం ప్రయాణించ లేని బలహీనత ఈ వైరస్ సొంతం. ఈ కారణంతో ప్రపంచం ఇలా అయినా ఉంది. లేదంటే.. మరింత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉండేవని చెప్పాలి. గాల్లో ఎక్కువ సేపు ఉండ‌లేని ఈ వైరస్ వెంట‌నే కింద ప‌డిపోతుంది. 

 

కోవిడ్ వైర‌స్ ఎంత సేపు ఉంటుంద‌న్న దానిపై చేస్తోన్న ప‌రీక్ష‌ల్లో ఈ వైరస్ గాల్లో మూడు గంటల పాటు బతికే ఉంటుందని తేలింది. ఇక ప్లాస్టిక్.. స్టీల్ లాంటి వాటిపైన మూడు రోజుల పాటు బతికి ఉంటుంద‌ట‌. కారు బోర్డు మీద 24 గంట‌లు బ‌తుకుంద‌ట‌. మ‌రో షాక్ ఏంటంటే రాగి మీద మాత్రం ఈ వైరస్ నాలుగు గంటల పాటు మాత్రమే యాక్టివ్ గా ఉంటుందని చెబుతున్నారు. మిగిలిన వాటితో పోలిస్తే రాగి క‌రోనా విష‌యంలో ఎందుకు గ‌ట్టిగా ఫైట్ చేస్తోంది ?  రాగిలో ఉన్న ఈ గుణం ఏంట‌న్న‌ది ప‌రిశీలిస్తున్నారు.

 

ఇక ఈ వైర‌స్ భారీన ప‌డ‌కుండా ఉండాలంటే జాగ్ర‌త్త‌లు చాలా అవసరం. చేతి వేళ్లు.. ముఖానికి.. ముక్కుకు.. నోటికి.. కళ్లకు టచ్ కాకుండా చూసుకోవటం చాలా అవసరం. అదే కరోనా నుంచి కాపాడుతుందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: