అమెరికాలోని తెలుగు వైద్యురాలు చైతన్య చెక్కిళ్ల, ఎండీ.. పేరిట చక్కర్లు కొడుతున్న పోస్టు ఇది.. 

 

నేను డాక్టర్ గా పోస్టులు పెట్టేది చాలా అరుదు. కరోనా వైరస్ గురించి చాలా మంది అజ్ఞానం చూస్తూ మాట్లాడకుండా ఉండలేక రాస్తున్నాను. చెప్పడం నా బాధ్యత కూడా! చెప్పాలంటే చాలా ఉంది కాని ఈ పోస్టులో ముఖ్యమైన విషయాలు రాసే ప్రయత్నం చేస్తాను. 

 

మొత్తం చదివే ఓపిక లేనివాళ్లకు ముఖ్యమైన విషయాలు ముందు:

 

కరోనా వైరస్ కు ఎవరూ అతీతులు కారు. భారతీయులతో సహా! భారతీయులు 'ఎంత గొప్పవాళ్లో' కరోనా వైరస్ కి తెలియదు. Take it seriously!

 

ఇప్పటి కరోనా వైరస్ పేరు severe acute respiratory syndrome coronavirus 2 (SARS-CoV-2). దీనితో వచ్చే వ్యాధిని coronavirus disease (COVID-19) అంటారు.

 

COVID-19 కి వాక్సీన్ లేదు. వాక్సీన్ రావడానికి కనీసం ఒక సంవత్సరం పట్టొచ్చు.

 

COVID-19 కి ట్రీట్మెంట్ లేదు. అన్ని దేశాల్లో రకరకాల hiv మందులు, ఇతర antivirals లాంటివి trial చేస్తున్నారు కాని ఇప్పటివరకు ఖచ్చితమైన treatment drugs లేవు. 

 

కొత్తగా ఉద్భవించిన వైరస్ కావడంతో ప్రపంచంలో ఎవరికీ ఈ వ్యాధి నుండి immunity లేదు. Epidemiologists అంచనాలా ప్రకారం దీనిని అదుపు చేయకపోతే ప్రపంచంలో సగం మంది కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉంది. అట్లా జరిగితే ఒక్క అమెరికాలోనే పది లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని వారి అంచనా. 

 

COVID-19 వల్ల వచ్చే symptoms ముఖ్యంగా పొడిదగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. 

 

COVID-19 రోగులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు respiratory droplets లో ఒకరినుండి ఒకరికి వ్యాపిస్తుంది. అందుకని వ్యాధి వచ్చినవాళ్లు ఇతరులకు సోకకుండా మాస్క్ వేస్కోవాలి. 

 

వైరస్ surfaces మీద 3 గంటల నుండి 3 రోజుల దాకా బతికి ఉండే అవకాశం ఉంది. అందుకే చేతులు కడుక్కోవడం, ముఖాన్ని చేతులతో ముట్టుకోకుండా ఉండడం చాలా అవసరం.

 

COVID-19 వైరస్ కి expose అయినాక వ్యాధి లక్షణాలు (symptoms) ఎక్కువ శాతం 5 రోజుల్లో  మొదలవుతాయి. అయితే 2-14 రోజుల్లో ఎప్పుడయినా symptoms మొదలవొచ్చు. అందుకే COVID-19 వ్యాధి వచ్చినవాళ్లతో contact లోకి వస్తే, లేదా అనుమానం ఉంటే 14 రోజులు అందరికీ దూరంగా (quarantine) ఉండాలి.

 

మామూలుగా వచ్చే influenza (flu) కన్నా COVID-19 కనీసం పదింతలు ఎక్కువ ప్రాణాంతకమైనది. 

 

COVID-19 నుండి 80% మంది తేలికపాటి symptoms (దగ్గు, జ్వరం)తో కోలుకుంటారు. 10-20 శాతం మందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుంది. 2-3 % మంది ఈ వ్యాధితో చనిపోతారు. చనిపోయేది చాలామటుకు వృద్ధులు, గుండెజబ్బు, డయబీటీస్ వంటి వ్యాధులు ఉన్నవాళ్లు. 

 

దీనితో ప్రాణనష్టం తగ్గించడానికి చేయవలసింది 'social distancing'. అంటే మనుషులను isolate చేయడం, events cancel చేయడం, మనుషులు సమూహాల్లో, గుంపులుగా కలవకుండా నివారించడం.

 

ఇది ఇప్పటివరకూ మనమెవరమూ చూసి ఎరగని  పరిస్థితి. This is something our generation is going to remember!

మరింత సమాచారం తెలుసుకోండి: