ప్రపంచ దేశాలను ప్రాణభయంతో వణికిస్తూ ఎంతో మందిని పొట్టనబెట్టుకున్న ప్రాణాంతకమైన కరోనా  వైరస్... అన్ని దేశాలకు శర వేగంగా వ్యాప్తి చెందుతూ విలయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచంలోని 150 దేశాలకు పైగా ఈ ప్రాణాంతకమైన మహమ్మారి విస్తరించింది. ఇప్పటికే భారతదేశంలో విస్తరించిన ఈ ప్రాణాంతకమైన వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రాణభయంతో బతుకుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారతదేశంలో ఈ వైరస్ బారిన పడి ఇద్దరు మృత్యువాత పడ్డారు. కాగా భారతదేశంలో ఇప్పటివరకు 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా ఇంకా ఎంతోమంది అబ్జర్వేషన్ లో  ఉన్నారు. ఇక ఈ కరోనా  వైరస్ కు  సరైన విరుగుడు కూడా లేకపోవడంతో... ప్రజలందరూ ప్రాణభయంతో వణికిపోతున్నారు. 

 

 

 కేవలం దేశంలో ఉన్న భారతీయులకే కాదు విదేశాల్లోని భారతీయులకు కూడా ఈ కరోనా  ముప్పు తప్పడం లేదు. విదేశాలలోని భారతీయుల్లో  ఇప్పటివరకు 276 మంది కరోనా  వైరస్ బారిన పడినట్లు  నిర్ధారణ అయిందని విదేశాంగశాఖ మంత్రి వి.మురళీధరన్ బుధవారం లోక్ సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ 276 మంది లో ఒక ఇరాన్ దేశం లోనే 255 మంది  భారతీయులు కరోనా  వైరస్ బారిన పడగా యూఏఈ లో 12 మంది, ఇటలీలో ఐదు మంది, శ్రీలంక,  కువైట్,రువాండా, హాంకాంగ్లో ఒక్కొక్కరు చొప్పున ప్రవాస భారతీయులు ఈ కరోనా  బారిన పడ్డారు. 

 

 

 ఇక యూఏఈలో కరోనా  వైరస్ బారిన పడిన ఎనిమిది మంది భారతీయులను క్వారంటైన్  చేసినట్లు వెల్లడించారు. సుమారు ఇరాన్ లో  ఆరువేల మంది భారతీయులు ఉన్నారు అని విదేశాంగ సహాయ మంత్రి వి మురళీధరన్  చెప్పారు. వారిలో జమ్మూ కాశ్మీర్, లడక్, మహారాష్ట్ర నుంచి పుణ్య క్షేత్ర సందర్శన కి వెళ్ళిన 1100 మంది... కేరళ ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లిన వెయ్యి మంది మత్స్యకారులు, జమ్మూ కాశ్మీర్ సహా పలు రాష్ట్రాల నుంచి వెళ్లిన 300 మంది విద్యార్థులు ఉన్నారు అంటూ వెల్లడించారు. ఇప్పటివరకు ఇరాన్ నుంచి మూడు వందల ఎనభై తొమ్మిది మంది వెనక్కి తీసుకు వచ్చాము అంటూ తెలిపారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: