ఏపీలో కొన్ని రోజుల క్రితం కేంద్రం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించటంతో ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నామని రాష్ట ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన అనంతరం వైసీపీ ఎన్నికల వాయిదా నిర్ణయంపై తీవ్ర విమర్శలు చేసి సుప్రీం మెట్లెక్కింది. సుప్రీం ఎన్నికల నిర్వహణలో ఈసీదే తుది నిర్ణయమని... రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ను ఎత్తివేయాలని తీర్పు చెప్పింది. 
 
అనంతరం ఎన్నికల కమిషనర్ సీఎం నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేల వరకు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని... తనతో పాటు, తన కుటుంబ సభ్యుల భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొందని లేఖ రాసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఒక వర్గం మీడియా అధికార పార్టీపై విమర్శలు చేస్తూ కథనాలను ప్రసారం చేసింది. తాజాగా ఈ లేఖ గురించి రమేష్ కుమార్ స్పందించారు. 
 
సోషల్ మీడియాలో తాను రాసినట్లు ఒక లేఖ వైరల్ అవుతోందని ఆ లేఖకు, తనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ వివరణ కోరగా వైరల్ అవుతున్న లేఖ ఫేక్ అని స్పష్టం చేశారు. నిన్నటినుండి రాష్ట్రవ్యాప్తంగా ఈ లేఖ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ లేఖ ఆధారంగా కొందరు టీడీపీ నేతలు వైసీపీపై విమర్శలు చేశారు. 
 
కొందరు సోషల్ మీడియాలో వైసీపీని, సీఎం జగన్ ను విమర్శిస్తూ పోస్టులు చేశారు. లేఖ ఫేక్ అని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేయడంతో టీడీపీ నేతలు పోస్టులను తొలగించారు. నిమ్మగడ్డ పేరుతో సోషల్ మీడియాలో బాబు గ్యాంగ్ లేఖను వైరల్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత సృష్టించడానికి బాబోరి గ్యాంగ్ ఎంతకైనా తెగిస్తుందని ప్రజల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.              

మరింత సమాచారం తెలుసుకోండి: