తన వ్యక్తిగత, కుటుంబసభ్యుల భద్రతపై రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ పేరుతో కేంద్ర హోంశాఖ కార్యదర్శికి వెళ్ళిన ఓ లేఖ రాష్ట్రంలో సంచలనంగా మారింది. సుదీర్ఘమైన లేఖలో ప్రభుత్వం గురించి, అధికారపార్టీ నేతల గురించి చాలా డ్యామేజింగ్ ఉంది. ఆ లేఖ చదివిన వారికి  నిజంగానే నిమ్మగడ్డతో పాటు ఆయన కుటుంబంసభ్యులకు ప్రాణహానీ ఉందనుకునే ప్రమాదం ఉంది. పైగా స్ధానిక సంస్ధల ఎన్నికలు అయిపోగానే నిమ్మగడ్డను చంపటానికి అధికారపార్టీ నేతలు పెద్ద వ్యూహం పన్నారా అనే  అనుమానం రావటం ఖాయం.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ఆ లేఖను అసలు తాను రాయనేలేదనే నిమ్మగడ్డ చెబుతున్నట్లు తాజాగా ప్రచారం మొదలైంది. నిమ్మగడ్డే రాసినట్లు ముందు ఎలా ప్రచారం జరిగిందంటే కేంద్ర హోంశాఖకు వెళ్ళిన లేఖ నిమ్మగడ్డ అధికారిక మెయిల్ నుండే వెళ్ళిందట. తన అధికారిక మెయిల్ నుండే కేంద్ర హోంశాఖకు లేఖ ఎలా వెళ్ళిందనే విషయంలో  నిమ్మగడ్డ మాట్లాడటం లేదు. పోనీ లేఖ రాసింది ఎవరో చెప్పమంటే తనకు తెలీదంటున్నారు. నిమ్మగడ్డకే తెలియకుండా ఆయన అధికారిక మెయిల్ నుండి లేఖ ఎలా వెళ్ళింది ? అన్నదే అందరిలోను పెరిగిపోతున్న అనుమానం.

 

ఎన్నికలు వాయిదా వేయటానికి ముందు జరిగిన ఎన్నికల ప్రక్రియలో వైసిపి నేతలు అరాచకానికి పాల్పడినట్లు లేఖలో  స్పష్టంగా ఉంది. ఆ లేఖను చూస్తే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారనటంలో సందేహం లేదు. పైగా ఎన్నికలు అయిపోగానే తనను చంపటానికి కొందరు రెడీగా ఉన్నారంటూ లేఖలో నిమ్మగడ్డ తన ఆందోళన వ్యక్తం చేసినట్లుంది. తాను ఏపిలో ఉండే పరిస్ధితులు లేవు కాబట్టి వెంటనే హైదరాబాద్ కు వెళ్ళిపోతానని కూడా నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖను రిక్వెస్ట్ చేసినట్లుంది.

 

ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం కుదించటం కిరాతక చర్యగా నిమ్మగడ్డ ఆరోపించినిట్లుగా ఉంది. పోలీసులపై తాను పెట్టుకున్న అంచనాలన్నీ తొలిదశలోనే తల్లకిందులైనట్లు ఆరోపణ చేసినట్లుంది. ఎన్నికల వాయిదాను  ఉపసంహరించుకునేట్లు తనపై అధికార పార్టీ ఒత్తిడి పెడుతోందన్నారు. ఎన్నికల వాయిదా విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదని, రాజ్యాంగబద్దమైన వ్యవస్ధలకు సరైన గౌరవం ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వానికి తెలీదంటూ నిమ్మగడ్డ ఆరోపించినట్లుంది. మొత్తానికి సదరు లేఖను తాను రియలేదని నిమ్మగడ్డ చెప్పినా పచ్చమీడియా మాత్రం సదరు లేఖను ప్రముఖంగా ప్రచురించటం గమనార్హం.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: