కరోనా బూచీ ప్రతి వారిని భయపెడుతుంది.. మామూలుగా చిన్న పిల్లలు భయపడాలంటే అదిగో బూచోడు వస్తున్నాడు నిన్ను పట్టిస్తా అని చెప్పే పెద్దలు కూడా ప్రస్తుత పరిస్దితుల్లో ఈ బూచోడికి భయపడుతున్నారు.. ఇంట్లో నుండి కాలు బయట పెట్టాలంటే వణికిపోతున్నారు.. ప్రపంచవినాశనం జరుగుతున్నంతగా ఆందోళన చెందుతున్నారు..

 

 

ఇప్పుడు ప్రతివారిలో ఒకటే ఆలోచన తొందరగా ఈ మాయదారి వైరస్ చచ్చిపోతే బాగుండును.. ప్రజా జీవనం ఎప్పటిలా సాగితే మంచి గుండును అని అనుకుంటున్నారు.. పరిస్దితులు గనుక ఇలాగే కొనసాగితే మనుషుల జీవన విధానం పూర్తిగా స్దంభించి పోతుంది.. ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులను మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొన వలసి వస్తుంది..

 

 

నిజంగా కరోనా వచ్చి ప్రపంచానికి సవాల్ విసిరింది.. ఈ ఉపద్రవం నుండి బయటపడాలంటే నాయకులు మాటలు చెప్పినంత ఈజీ కాదు.. ఇక ఇప్పటికే చిన్న జలుబు వచ్చినా భయంతో ప్రజలు అల్లాడి పోతున్నారు.. ఇలాంటి పరిస్దితుల్లో మానసిక ధైర్యాన్ని కోల్పోతున్నారు కొందరు..

 

 

ఇదిగో ఇలా భయపడే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.. ఆ వివరాలు తెలుసుకుంటే.. ఢిల్లీలోని విమానాశ్రయ వర్గాలు సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రికి కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ఓ వ్యక్తిని తీసుకొచ్చాయి. ఆ వ్యక్తిని ఏడో అంతస్తులోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి, అతని నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు.

 

 

ఈలోపల ఏదేదో ఊహించుకున్న ఆ వ్యక్తి తీవ్రమైన మానసిక సంఘర్షనకు లోనై ఒత్తిడితో ఆస్పత్రి ఏడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఇకపోతే ఇతను సంవత్సర కాలం నుండి సిడ్నీలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: