ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి వలసలు ఆగటం లేదు. అలాగే ప్రస్తుతం కరోనా వల్ల బ్రేక్ పడ్డ స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూడా వలసలు అవుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా చాల మంది వరుస వలసలతో అధికార పార్టీ బాట పట్టారు. ఇప్పుడు ఉన్న టీడీపీ నాయకులు కూడా అధికార పార్టీకి జంప్ అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. వారిలో కర్నూల్ జిల్లా బనగానపల్లెకు చెందిన టిడిపి ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డి పేరు ఈ లిస్ట్ లో ఉందట.

 

అయితే తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం పై జనార్ధన్ స్పందించారు. అధికార పార్టీలోకి చేరుతానని వచ్చిన వార్తలు అవాస్తవమని నేను ఎక్కడికి వెళ్ళటం లేదనిటీడీపీ లోనే ఉంటానని అయన స్పష్టం చేసారు. అధికార పార్టీ నాయకులతో సంప్రదింపులు, సమావేశాలు జరిపినవన్నీ అవాస్తవాలేనని ఆయన కొట్టి పడేశారు. నేను వ్యక్తిగత పనుల కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చిందని, అసలు టీడీపీ పార్టీని వదిలే ఉద్దేశమే లేదని ఆయన స్పష్టం చేశారు.

 

నేను పార్టీని విడిచి ఎక్కడికి పోనని ఎవరు అధైర్య పడవద్దని టీడీపీ కార్యకర్తలకు దైర్యం చెప్పారు. కష్టకాలంలో వున్న పార్టీకి అండగా ఉండి పార్టీ బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తానని బిసి జనార్ధన్ తెలిపారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో బిసి జనాార్ధన్ కి బలమైన నేతగా పేరుంది. దీంతో ఆయనకు వలవేసి టీడీపీని దెబ్బ తీయాలని చూస్తున్నారని కానీ అలంటి పప్పులేమి ఉడకవని ఆయన అన్నారు. జనార్దన్ రెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ పత్తికి గట్టిపోటీ ఇచ్చారు. కానీ వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో సుమారు 13 వేల ఓట్లు మెజార్టీతో ఓటమి పాలయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: