కరోనా మ‌హమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని అత‌లాకుత‌లం చేసేస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా 163 దేశాల‌కు క‌రోనా వైర‌స్ పాకేసింది. క‌రోనా బాధితుల సంఖ్య సైతం 2 లక్ష‌లు క్రాస్ చేసింది. మ‌రో వైపు క‌రోనా సోకిన వారిలో 8 వేల మందికి పైగా మృతి చెందారు. ముందుగా క‌రోనా వైర‌స్ స్టార్ట్ అయిన చైనాలో క్ర‌మ క్ర‌మంగా మ‌ర‌ణాలు త‌గ్గు ముఖం ప‌డుతుండ‌గా ఇప్పుడు ఇరాన్ దేశం క‌రోనా దెబ్బ‌తో చిగురు టాకులా వ‌ణికి పోతోంది. ఇక మ‌న దేశంలో కూడా ఇప్ప‌టికే క‌రోనా బాధితులు 180కు చేరువు అవుతున్నారు. ఇక తెలంగాణ‌లో గ‌త రాత్రి ఒక్క రోజే క‌రోనా బాధితులు 7 గురు బ‌య‌ట‌కు రావ‌డంతో అక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బాధితుల సంఖ్య 13కు చేరుకుంది.



ఇక ఇప్పుడు మ‌న దేశంలోని అన్ని రాష్ట్రాల్లో క‌రోనాకు బ్రేకులు వేసేందుకు  అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాయి. ఇక క‌రోనా నివారణలో ప్రథమాస్త్రం శానిటైజర్‌. వీలైనన్ని సార్లు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోండనే ప్రచారం చెవిన ఇల్లుకడుతోంది. ఈ నియమాన్ని ప్ర‌తి ఒక్క‌రు పాటించాల‌ని మీడియాలో కూడా వార్త‌లు... అటు ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు కూడా వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే క‌రోనా వైర‌స్‌కు శుభ్ర‌తే నివార‌ణ మార్గం అంటూ ఓ వ్య‌క్తి బ్రాండ్ అండాసిడ‌ర్‌గా మారాడు. ఇంత‌కు ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు. ఊబర్‌లో ఆటో నడిపిస్తున్న గుగులోత్‌ భాను. తను మాస్క్‌ కట్టుకోవడమే కాదు.. తన ఆటోలో ఎక్కిన ప్రయాణికులూ కట్టుకునేలా చేస్తున్నాడు.



‘మీరు మాస్క్‌ వేసుకోకపోతే నా ఆటోలో రావద్దు’ అని హెచ్చరిస్తున్నాడు. మాస్క్ ఉన్న వాళ్ల‌నే త‌న ఆటోలో ఎక్కించుకుంటాన‌ని.. లేని ప‌క్షంలో నా ఆటో ఎక్క‌వ‌ద్ద‌ని అత‌డు చెప్పేస్తున్నాడు. ఇక శానిటైజ‌ర్ ద్వారా ఆటో సీటు, హ్యాండిల్స్ క్లీన్ చేసి వాటిని బ‌య‌ట ప‌డేయ‌కుండా మ‌రో బ్యాకులో పెడుతున్నాడు. వాటిని సాయంత్రం మా ఇంటికి తీసుకు వెళ్లాక గుంత‌లో పూడుస్తాన‌ని చెపుతున్నాడు. ఏదేమైనా ప్ర‌తి ఒక్క‌రు భానును ఆద‌ర్శంగా తీసుకుంటే క‌రోనా మ‌హ‌మ్మారికి చాలా వ‌ర‌కు బ్రేకులు వేయ‌వ‌చ్చ‌నే చెప్పాలి. భానును చూసిన వారు కరోనా నివారణ చర్యల గురించి చెప్పడానికి ఇంతకన్నా గొప్ప బ్రాండ్‌ అంబాసిడర్‌ దొరుకుతాడా ?  అని అత‌డిని ప్ర‌శంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: