’పోరాటం ఆపద్దు... మేమంతా మీవెంటే’ ... ఇది రాజధాని అమరావతి కోసం పోరాడుతున్న ఆందోళనకారులకు తాజాగా  చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపు. ఒకవైపేమో కరోనా వైరస్ గురించి ప్రతి రోజు గంటల తరబడి లెక్షర్లిస్తుంటాడు. కరోనా వైరస్ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయటంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందంటూ అమ్మనాబూతులు తిడుతుంటాడు. ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న వైరస్ విషయంలో జగన్ ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోవటం లేదని బురద చల్లేస్తాడు. వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించటంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందంటాడు.

 

కానీ అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న వారికి మాత్రం ఆందోళనలు ఆపవద్దని చెబుతాడు. నలుగురు ఒకచోట గుమిగూడినా కరోనా వైరస్ వచ్చేస్తుందన్న కనీస జ్ఞానం కూడా జగన్ ప్రభుత్వానికి లేదంటూ బుధవారం సాయంత్రం గంటన్నర పాటు పెట్టిన మీడియాలో ఒకటే ఊదరగొట్టాడు. మరి రాజధాని గ్రామాల్లో పదుల  సంఖ్యలో ఆందోళనలు చేస్తున్న వారికి కరోనా వైరస్ రాదా ? వైరస్ గురించి ఆలోచించకుండా వారిని మాత్రం ఆందోళనలు ఆపవద్దని ఎలా చెబుతున్నాడు ?  పైగా పోరాటం ఆపవద్దు మీ వెంట మేమున్నాం అంటూ తాజాగా ఇచ్చిన పిలుపు విచిత్రంగా ఉంది.

 

అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటే మాత్రం చంద్రబాబు ప్రోత్సహించి మద్దతుగా నిలబడతాడు. ఇదే సమయంలో మిగిలిన రాష్ట్రంలో మాత్రం జనాలు తన పనులన్నింటినీ మానుకుని ఇళ్ళల్లోనే  కూర్చోమని నీతులు చెబుతాడు. ఒకవైపు ప్రభుత్వం కరోనా వైరస్ పై ముందు జాగ్రత్తలు చెబుతున్నా అవేవీ పట్టకుండా ప్రభుత్వంపై బురద చల్లేస్తుంటాడు.  మొత్తానికి చంద్రబాబు టార్గెట్ ఏమిటంటే జగన్ ప్రభుత్వాన్ని గబ్బు పట్టించటమే. రాజధాని ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తున్న వాళ్ళకి కరోనా వైరస్ సోకితే చంద్రబాబే బాధ్యత వహిస్తాడా ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: