కరోనా భయంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న చికెన్  ప్రియులు అందరూ చికెన్ మటన్... బిర్యానీ లు బంద్ చేసి కూరగాయల షాపులకు పరుగులు పెడుతున్నారు. నాన్వెజ్ ఎందుకు ? అంత రిస్క్ ఇప్పుడు అవసరమా ? అని మాంసాహారం వైపు వెళ్లడం లేదు. మరోవైపు రోజురోజుకు క‌రోనా వైర‌స్ అన్ని చోట్ల శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో తెలంగాణ రాజధాని గ్రేటర్ హైదరాబాద్ లో కూరగాయలకు ఎక్కడలేని డిమాండ్ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు కోటి మంది ప్రజలు నివాసముంటున్నారు. ఇక్కడ ప్రతిరోజు మూడు వేల టన్నుల వినియోగించేవారు. అంటే ప్రతి మనిషికి సగటున 300 గ్రాముల కూరగాయలు అవసరం అయ్యేవి.



అయితే ఇప్పుడు ఆ ప్రభావంతో నగర‌ జనాలు అందరూ మాంసానికి దూరమయ్యే పరిస్థితి వచ్చేసింది. దీంతో ఇప్పుడు మ‌రో వెయ్యి ట‌న్నుల కూర‌గాయ‌లు అదనంగా అమ్ముతున్నారు. గత పది రోజుల నుంచి కరోనా వైరస్ తెలంగాణలో బాగా విస్తరిస్తూ ఉండడంతో కూరగాయలకు భారీ డిమాండ్ ఏర్పడింది. నగర చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రా లోని కర్నూలు , చిత్తూరు , అనంతపురం , కర్ణాటకలోని చిక్‌బ‌ళ్లాపూర్ ప్రాంతం నుంచి భారీ ఎత్తున నగరానికి కూరగాయలు దిగుమతి అవుతున్నాయి.



ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మార్కెట్లో కేజీ టమాటా తక్కువగా పది రూపాయలు ఉండగా.. చిక్కుడు కాయలు, బెండకాయలు కేజీ 40 వరకు పలుకుతున్నాయి. వచ్చే నెలతో కూర‌గాయ‌ల సీజ‌న్ ముగుస్తుండటంతో అప్పుడు కూరగాయల రేట్లు మరింత ప్రియం కానున్నాయి. ఇక న‌గ‌రానికి అద‌నంగా ఒకేసారి వెయ్యి ట‌న్నుల కూర‌గాయాలు దిగుమ‌తి చేసుకోవాల్సి వ‌స్తుండ‌డంతో అన్ని కూర‌గాయాల రేట్లు గ‌త వారం రోజుల్లోనే డ‌బుల్ అయ్యాయి.



అదే టైంలో చికెన్ కొనేవాళ్లు కూడా క‌రువ‌వుతున్నారు. చికెన్ రేట్లు పూర్తిగా ప‌డిపోతున్నాయి. కిలో చికెన్ కేవ‌లం రు. 40 కు కూడా ఇస్తున్నారు. దీనిని బ‌ట్టి క‌రోనా చికెన్ బిజినెస్‌కు దెబ్బేస్తే అదే టైంలో కూర‌గాయాల బిజినెస్‌కు భారీ లాభాల పంట పండిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: