కరోనా ప్రభావం ఇప్పుడు మనుషులపైనే కాదు.. మాంసం విక్రయం పై కూడా పడిపోతుంది.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ కరోనా వైరస్  మాంసం మార్కెట్ ద్వారా వైరస్ వ్యాపించిందని శాస్త్రవేత్తలు చెప్పడంతో దెబ్బకు కోడి కూర తినడం మానేశారు.  కేవలం చికెన్ మాత్రమే కాదు మటన్, చేపలు ఇతర మాంసాహారం మొత్తం తినడం మానేస్తున్నారు.  దాంతో మాంసం విక్రయదారులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కరోనా వైరస్ వల్ల పౌల్ట్రీ రంగానికి ఇప్పటికీ దాదాపు 500 నుండి 800 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఒక అంచనా. ఇప్పడు వేసవి కాలం.. సాధారణంగా చికెన్ రేటు పెరిగి కనీసం రూ.250 వరకు ఉంటుంది. కానీ కరోనా ఎఫెక్ట్ తో కేవలం రూ.30 నుంచి రూ.20 పడిపోయింది.  

 

మొన్నటి వరకు కోడి గుడ్డు రూ.5 వరకు ఉండేది.. కానీ ఇప్పుడు ఒక్కరూపాయికే అమ్మే పరిస్థితి నెలకొంది.  అయినా కూడా వీటిని కొనేందుకు జనాలు ఉత్సాహం చూపిండం లేదు. దాంతో  రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సైతం చికెన్ మరియు ఎగ్ మేళా నిర్వహించి చికెన్ మరియు గుడ్లు తింటే కరోనా వైరస్ రాదని ఎంత చెప్పినా ప్రజలు మాత్రం నో... అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో మాంసాహారం తినే అలవాటున్న ప్రజలు అదేవిధంగా శాఖాహారం తింటూనే మాంసాహారం కూడా తినే అలవాటున్న ప్రజలు అందరూ అన్ని రకాల మాంసాహారం తినడం తగ్గించి వేశారు.

 

దాంతో శవ్యాప్తంగా,  రాష్ట్ర వ్యాప్తంగా పౌల్ట్రీ రంగానికి సంబంధించిన పెద్దలు ఒక సంచలనాత్మకమైన ప్రకటన చేశారు. కోడి లో కరోనా వైరస్ ఉందని శాస్త్ర పూర్వకంగా నిరూపించిన వారికి కోటి రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. అయినా కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదు.. చూస్తూ చూస్తూ ప్రాణాలు రిస్క్ లో పెట్టడం ఎందుకని.. దాన్ని తినకపోతే నష్టం ఏమీ లేదని అంటున్నారు. మొత్తానికి కరోనా ప్రభావంతో  పౌల్ట్రీ రంగానికి  కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి: