ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. బుధవారం రాత్రి తెలంగాణలోని ఒక్కసారిగా ఏడు కొత్త కేసులు బయటపడడంతో హైదరాబాద్ నగరం అంతా దెబ్బతో చిగురుటాకులా వణికిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఎవరికి వారు ఎన్నో జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఇక ప్రతి ఒక్కరు మాస్కులు , గ్లోవ్స్‌ ధరించాలని ఇది రెండు కరోనా వైరస్ వ్యాప్తిని కొంతవరకు అరికడతాయి అని చెబుతున్నారు. అయితే సరైన పద్ధతులు పాటించ‌క పోతే క‌రోనా వైరస్ వ్యాప్తి మరింత విస్తరిస్తుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టే  వరకు తరచు ముఖం చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని... ఇతరుల ముఖాన్ని తాగకూడదని... సామాజిక దూరం పాటించాలి అని సూచిస్తున్నారు.



ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మాస్క్‌లు, గ్లోవ్స్‌ ధరించడంతో వీటి లభ్యత తగ్గిపోయే పరిస్ధితి నెలకొంది. ఇర వైర‌స్ విస్త‌రించ‌కుండా మాస్క్‌లు ఎంత జాగ్ర‌త్త‌గా వాడాలో ?  సూచిస్తున్నారు. వైరస్‌ సోకకుండా మిమ్నల్ని మాస్క్‌లు కాపాడేందుకు పరిమితులున్నాయని, ప్రతి ఒక్కరూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రతను పాటించడంతో పాటు చేతులతో ముఖాన్ని తాకరాదని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్‌ డైరెక్టర్‌ మైక్‌ ర్యాన్‌ ప్రజలకు సూచించారు.



ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ 19 కేసులను పరిశీలించే వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు నెలకు 8.9 కోట్ల మాస్క్‌లు అవసరమని అంచనా వేస్తుండగా ఇది మరిన్ని రోజులు కొనసాగితే వైద్య సిబ్బందికే మాస్క్‌లు సరిపోని పరిస్ధితి. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ వ్యాప్తంగా మాస్క్‌లు. ఇత‌ర‌త్రా జాగ్ర‌త్త‌ల విష‌యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చేస్తోన్న నిబంధ‌న‌లు ప్ర‌జ‌ల‌కు స‌రిగా వెళ్ల‌డం లేద‌న్న ఆందోళ‌న‌లు కూడా ఆరోగ్య సంస్థ ప్ర‌తినిధులు వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్ర‌తి ఒక్క‌రు ఇత‌రుల చర్మాన్ని తాకడం, చెవులు, కళ్లు, ముక్కు ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని కూడా నిపుణులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: