బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు భలే క్యామిడి చేస్తున్నాడు. స్ధానిక సంస్దల ఎన్నికలను వాయిదా వేయటం, తర్వాత సుప్రింకోర్టులో కేసులు, విచారణ తదితరాలపై జీవిఎల్ చాలానే మాట్లాడాడు. ఈ సందర్భంగానే ఓ జోక్ పేల్చాడు. అదేమిటంటే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైసిపి, టిడిపిలకు బిజెపి+జనసేనలు ఇపుడు చూపిస్తున్నది జస్ట్ ట్రైలర్ మాత్రమే అని. మిత్రపక్షాలు టిడిపి సంగతి ఏమో కానీ వైసిపికి చూపించిన ట్రైలర్ ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు.

 

652 జడ్పిటిసిలకు గాను బిజెపి, జనసేనలు కలిసి వేసిన నామినేషన్లు మహా అయితే ఓ రెండొందలు ఉంటే మహా ఎక్కువ. అలాగే 9696 ఎంపిటిసి స్ధానాలకు గాను వేసింది ఓ నాలుగు వేలుండచ్చు. అంటే జడ్పిటిసి, ఎంపిటిసిల స్ధానాల్లో అన్నింటికి రెండు పార్టీలూ కలిసి కూడా నామినేషన్లు వేయలేకపోయాయి. అంటే పోటి చేయటానికి రెండు పార్టీల నుండి నాయకులు ముందుకు రాలేదన్న విషయం అర్ధమైపోతోంది. అన్నీ చోట్ల పోటి చేయటానికే నామినేషన్లు వేయలేకపోయిన బిజెపి, జనసేన పార్టీల నేతలు ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అంటే ఎవరైనా నమ్ముతారా ?

 

ఇక మున్సిపల్ వార్డుల్లో కూడా అన్నీ వార్డులకు నామినేషన్లు వేయలేకపోయారన్నది వాస్తవం. వాస్తవం ఇలాగుంటే చంద్రబాబునాయుడు చేస్తున్న ఆరోపణలనే బిజెపి, జనసేన అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, పవన్ కల్యాణ్ రిపీట్ చేస్తు కాలక్షేపం చేస్తున్న విషయాన్ని అందరూ చూస్తున్నదే.

 

మొన్నటి ఎన్నికల్లో బిజెపికి వచ్చిన ఓట్లు 0.84 శాతం మాత్రమే. ప్రస్తుత స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఇంతకన్నా తగ్గేదే కానీ ఎక్కువైతే ఓట్లు రాదన్నది వాస్తవం. ఇదే సమయంలో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన నేతలు బిజెపిని కాదని తెలుగుదేశంపార్టీ నేతలతో కలిసి నామినేషన్లు వేశారు. అంటే జనసేన నేతలే బిజెపికి ట్రైలర్ చూపించిన విషయం అర్ధమైపోతోంది. మొత్తానికి జీవిఎల్ భలే క్యామిడి చేస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: