భయంకరమైన భూకంపం వస్తే ఒక్క సారిగా ప్రజావ్యవస్ద నాశనం అవుతుంది.. కాని వైరస్‌ల మూలంగా కరోనా లాంటి వ్యాధులు వస్తే మాత్రం దీని ప్రభావం చాలాకాలం వరకు ఉంటుంది.. ఒక్కసారిగా కనిపించక క్రమక్రమంగా లోకానికి గుదిబండలా మారుతుంది.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కూడా ఇలాంటిదే.. ఈ వైరస్ ప్రజలను ఎన్ని ముప్పతిప్పలు పెడుతుందో అందరికి తెలిసిందే.. అయితే ఈ వైరస్ తగ్గుముఖం పట్టినాక కూడా ఇంతకు పదిరేట్ల బాధను అనుభవించేలా చేస్తుంది..

 

 

ఇక ఇదంతా ఒకెత్తైతే చైనాలో వూహన్‌లో పుట్టిన ఈ వైరస్ వల్ల ఆ దేశపరిస్దితులు చాలా దారుణంగా మారాయట.. అక్కడి ప్రజలు పడే నరకవేధన చూడాలంటే ఒక కఠినమైన మనస్సుగల వారికే సాధ్యమట.. ఇప్పటికే చైనా వల్ల ఇటలీ కూడా చాలా క్లిష్టమైన పరిస్దితులను ఎదుర్కొంటుంది.. ఇటలీలో ఉన్న లెదర్ ఇండ్రస్ట్రీలో లక్షకు పైగా చైనా కార్మికులు పనిచేస్తుండగా, వీరు తరచుగా చైనాకు వెళ్లిరావడం వల్ల ఇటలీలో ఇప్పుడు మరణమృదంగం మోగుతుందట.. అంటే ఇక్కడ మరణాల సంఖ్య ఎంత భీభత్సంగా ఉందో అర్ధం చేసుకోవచ్చూ.. ఇక చివరికి శవ సంస్కారాలకు సైతం క్యూ పద్దతిని పాటిస్తున్నారట.. అందులో శవపేటికలు తయారు చేసే వారికి చెక్క దొరక్క, శవాల సంస్కారాలకు పాస్టర్లు దొరక్క చివరికి చనిపోయిన వారి శవాలను ఇంట్లోనే పెట్టుకుని అసహనంతో ఎవరికి చెప్పుకోలేక కృంగిపోతున్నారట..

 

 

ఇక ఎలక్ట్రికల్ దహనం చేసే వాటికకు తీసుకు వెళ్లుదామన్నా అక్కడ కూడా క్యూనే ఉంటుందట.. ఇలాంటి పరిస్దితుల్లో బహిరంగ దహన సంస్కారాలు చేద్దామనుకున్న వారికి అనుమతి ఇవ్వక టోకెన్ నెంబర్లు జారిచేసి అవి వచ్చేదాక ఆగండని అధికారులు చెబుతున్నారట.. ఇక ఇటలీకి సహాయం చేసే దేశాలు లేక అక్కడి ప్రజలు అల్లాడుతుండగా, చైనా మాత్రం ఎక్కడ చైనీయులను, ఇటలీ, చైనాకు తిరిగి పంపిస్తుందో అనే భయంతో మాత్రం నామమాత్రపు సహాయం అందిస్తుందట.. ఇకపోతే ఇటలీలోగాని, చైనాలో గానీ.. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గుతుందే గానీ మృతదేహాల ఖననం ఇంకా పూర్తి అవ్వలేదట.. అంటే దీనిబట్టి అర్ధం అయ్యేది ఏంటంటే ఊరు ఊరంతా దాదాపుగా వల్లకాడులా మారిందని అర్ధం అవుతుంది.. ఇక విధ్యంసం జరిగితేనే ఏళ్లతరబడి చరిత్రలో నిలిచిపోతుంది.. మరి ఈ కరోనా చూపిస్తున్న ప్రతాపం ఎన్ని సంవత్సరాల వరకు ప్రజల గుండెల్లో ఉంటుందో.. 

మరింత సమాచారం తెలుసుకోండి: