దేశంలో కరోనా భారీన పడిన వారి సంఖ్య 170కు చేరింది. గంటగంటకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణలో ఇప్పటివరకూ 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో గతంలో నెల్లూరులో ఒక పాజిటివ్ కేసు నమోదు కాగా తాజాగా ఒంగోలులో మరో పాజిటివ్ కేసు నమోదైంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ఒడిశా రాష్ట్రం విదేశాల నుంచి వచ్చేవారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్ లో పూర్తి వివరాలు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 
 
ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చిన వారు లేదా బంధువర్గాలు, ఆత్మీయులు వివరాలను నమోదు చేయాలని సూచించింది. తాజాగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తన సోదరి గీతా మెహతా వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేశారు. రాష్ట్రానికి చేరిన 24 గంటలలోగా వివరాలను నమోదు చేయాలనే తమ ప్రభుత్వ ఆదేశాలను ఆయన పాటించారు. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే వారు ఐపీసీ నిబంధనల మేరకు చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారు. 
 
విదేశాల నుంచి తన సోదరి రానుండటంతో ఆయన చెల్లెలి వివరాలను నమోదు చేసి పారదర్శకత చాటుకోవడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మహారాష్ట్రలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రోజుకూలీలకు ఆర్థిక సాయం అందజేస్తుంది. 
 
కరోనా పుట్టుకకు కారణమైన చైనాలో నిన్న ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. శాస్త్రవేత్తలు కరోనాను అరికట్టడానికి విసృత పరిశోధనలు చేస్తున్నారు. అందులో భాగంగా వ్యాక్సిన్ పై విసృత పరిశోధనలు జరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు ఇరాన్ లోని ప్రవాస భారతీయులు 255 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: