ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ఏపీలో కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వైరస్ దెబ్బకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి. అయితే ఈ వైరస్‌పైన అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు రాజకీయం చేస్తున్నాయి. కరోనా వైరస్ ప్రభావం పెద్దగా లేకపోయిన, టీడీపీ నేతలు ఎన్నికల కమిషనర్‌ని అడ్డుపెట్టుకుని ఎన్నికలు వాయిదా వేయించారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే, అంత పెద్ద వైరస్ వస్తుంటే బుద్ధి లేకుండా ఎన్నికలు అంటారు ఏంటని వైసీపీ వాళ్ళ మీద టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

 

ఇలా కరోనా మీద వీరి రాజకీయం నడుస్తుండగానే, తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయితీలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.  ముమ్మిడివరం నగర పంచాయిటీకి చెందిన 7వ వార్డులో టీడీపీ తరుపున గంజా వెంకటేశ్వరరావు పోటీ చేస్తుండగా, వైసీపీ తరుపున కముజు రమేశ్ పోటీ చేస్తున్నారు. అయితే ఇదే వార్డులో ఉన్న టీడీపీ కీలక నేత శీలం కృష్ణమూర్తి, గంజా వెంకటేశ్వరరావు తరుపున ప్రచారం చేస్తున్నారు. కృష్ణమూర్తి 7 వార్డు మాజీ కౌన్సిలర్‌గా అని చేశారు. అందువల్ల ఈ వార్డుపై ఆయనకు గ్రిప్ ఉంది.

 

అయితే ఈ విషయం అర్ధం చేసుకున్న వైసీపీ అభ్యర్ధి కముజు రమేశ్, టీడీపీ నేతకు కరోనా వచ్చిందని ప్రచారం చేశారు. ఆయన గురించి వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టారు. ఇక ఈ మెసేజ్ కాస్త టీడీపీ నేతకు చేరుకోవడంతో, ఆయన కేసు పెట్టారు. టీడీపీ అభ్యర్ధి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నానే ఇలా చేశారని, కరోనా ఉందని అసత్య ప్రచారం చేయడంతో, ప్రజలు తన దగ్గరకు రావాలంటే భయపడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక దీనిపై అమలాపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్ధి హరీష్ బాలయోగి స్పందిస్తూ, ఓటమి భయంతోనే వైసీపీ అభ్యర్ధి ఇలా విష ప్రచారం చేస్తున్నారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: