కరోనా మహమ్మారి వలన చదువు కోసం విదేశాలకు వెళ్ళిన భారతీయులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. విదేశాల్లో కరోనా వైరస్ సంక్రమిస్తుందన్న భయంతో అక్కడ ఉండలేక... స్వదేశానికి తిరిగి వచ్చెనందుకు ప్రయాణ సౌకర్యాలు లేక అనేకమైన ఇక్కట్లు పడుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి వలన పరదేశ ప్రయాణికులను ఏ ఒక్క ప్రభుత్వం తమ దేశంలోకి అనుమతించడం లేదు. దురదృష్టవశాత్తు ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రానికి చెందిన శివాణి అనే ఓ అమ్మాయి జార్జియా దేశంలో తీవ్ర అనారోగ్యానికి గురైంది. అసలే విమానాశ్రయాల సేవలను నిలిపి వేసిన ఈ సమయంలో ఆమె దేశం కాని దేశంలో తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో కుటుంబ సభ్యులతో పాటు అందరూ తీవ్రంగా భయాందోళనలకు గురవుతున్నారు.




పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరికి చెందిన శివాణి ఉన్నత విద్య అయిన డాక్టర్ చదువును అభ్యసించడం కోసం జార్జియా దేశానికి వెళ్ళింది. అయితే రెండు రోజుల క్రితం తాను కాలేజీ కి వెళ్తున్న సమయంలో కాలేజీ బస్సులోనే వాంతులు చేసుకుంటూ తీవ్ర అస్వస్థతకు గురై సృహ తప్పి పడిపోయింది. దాంతో తోటి విద్యార్థులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా... వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టిందని తెలిపారు.

 

 

ఈ విషయాన్ని తోటి విద్యార్థులు శివాణి తల్లిదండ్రులైనా వెంకటేశ్, సరిత లకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కంగారు పడిపోతూ తన బిడ్డని తమ వద్దకు పంపించమని కోరారు. అలానే హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలోని డాక్టర్లను సంప్రదించి తన బిడ్డకి మెరుగైన వైద్యం అందించాలని ముందస్తు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ శివాణి ని భారతదేశానికి తరలించేందుకు జార్జియా అధికారులు నిరాకరించారు. శివాణి ని భారతదేశానికి పంపించేందుకు జార్జియా అధికారులు అడ్డుకోవడంతో శివాణి తల్లిదండ్రులు అసహనం తో కూడిన ఆవేదన వ్యక్తం చేస్తూ ఆలస్యం అయితే తన బిడ్డ చనిపోతుందని గుండెలు బాదుకుంటూ రోదిస్తున్నారు. తన బిడ్డ ని భారతదేశానికి తీసుకొచ్చి ఆమె ప్రాణాలను కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: