రాష్ట్రప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని కూడా బాగా కించపరుస్తు ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో వెలుగు చూసిన లేఖ పై ప్రభుత్వమే సూమోటోగా దర్యాప్తు చేయించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. స్ధానిక సంస్ధల ఎన్నికల వాయిదా నేపధ్యంలో బుధవారం సుప్రింకోర్టు తీర్పు చెప్పిన సాయంత్రమే నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాశారంటూ ఓ లేఖ వెలుగు చూసింది. ఆ లేఖను పచ్చమీడియా విపరీతంగా ప్రచారం చేసింది.

 

ఇక్కడ విషయం ఏమిటంటే కేంద్ర హొంశాఖ కార్యదర్శికి నిమ్మగడ్డ లేఖ రాశాడా లేదా అన్నది ధృవపడలేదు. కానీ నిమ్మగడ్డే రాశాడంటూ పచ్చమీడియా ప్రభుత్వాన్ని గబ్బు పట్టించేసింది. ఆ లేఖలో ఇటు వైసిపి పార్టీ మీద ఆరోపణలు చేయటమే కాకుండా ప్రభుత్వ వైఫల్యం మీద కూడా తీవ్రమైన ఆరోపణలున్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డిని పరోక్షంగా కించపరుస్తు చాలా ఆరోపణలే ఉన్నాయి. దాదాపు ఐదు గంటల పాటు పచ్చమీడియాలో విపరీతమైన ప్రచారం జరిగిపోయిన తర్వాత చాలా నింపాదిగా ప్రచారంలో ఉన్న లేఖను తాను రాయలేదని నిమ్మగడ్డ చెప్పాడు.

 

మొత్తానికి కొద్ది రోజులుగా జగన్-నిమ్మగడ్డల వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో కేంద్ర హోం శాఖకు రాసినట్లుగా చెలామణి అయిన లేఖ కూడా అంతే సంచలనమైంది. మొత్తం మీద ఆ ఫేక్ లెటర్ విషయాన్ని అంతు చూసేంత వరకూ వదలి పెట్టకూడదని జగన్ డిసైడ్ అయినట్లున్నాడు. ఇందులో భాగంగానే  డిజిపి గౌతమ్ సవాంగ్ తో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ మనీష్ అత్యవసర భేటి జరపటం కీలకంగా మారింది.

 

నిజానికి ఎలక్షన్ కమీషనర్ పేరుతో కేంద్ర హోం శాఖ కార్యదర్శికి జీ మెయిల్ వెళ్ళే అవకాశమే లేదు. ఎందుకంటే మామూలు మెయిల్ ల్లో సమాచార మార్పిడి జరగటం లేదు. ఉత్తర ప్రత్యుత్తరాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా హాట్ మెయిల్ ఉపయోగించుకుంటున్నాయి. ఇపుడు నిమ్మగడ్డ పేరుతో వెళ్ళిన లేఖ జీ మెయిల్ లోనే వెళ్ళింది. అదే సమయంలో తాను మెయిల్ పంపలేదని చెప్పటంతో నిమ్మగడ్డ పేరుతో ఎవరు మెయిల్ పంపారనే విషయాన్ని తేల్చుకునే పనిలో పడింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: