కరోనా లేదా కొవిడ్ 19.. ఈ వైరస్ పేరు చెబితేనే ఆమ‌డ దూరం పారిపోతున్నారు. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. క‌రోనా మృతుల సంఖ్యా పెరుగుతోంది. ఈ వైర‌స్ కేవ‌లం మ‌నుషులపైనే కాకుండా అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతోంది. చలికాలంలో ఈ వైరస్ తీవ్రత, వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇది సోకిన వాళ్లు తుమ్మినా, దగ్గినా వారి ద్వారా ఈ వైరస్ ఇతరుల శ్వాసకోశ నాళంలోకి ప్రవేశించడం ద్వారా వ్యాప్తి చెందుతోంది. ప్ర‌స్తుతం ఈ వైరస్‌ని అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలే జరుగుతున్నాయి.

 

ఇక ప్రపంచవ్యాప్తంగా 1550 దేశాల‌కు పైగా విస్తరించిన కరోనా వైరస్ ప్రమాద ఘంటికలను మోగిస్తున్న వేళ, ఇండియాలో సౌతం కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ప్రజలు కూడా బయట తిరగకుండా ఇంటికే ప‌రిమితం అయ్యారు. అలాగే స్వీయ నిర్బంధంలోని తమ అనుభవాలను కొంద‌రు సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా  ఓ స్టార్‌ కపుల్‌కు చెందిన ముద్దు ముచ్చట నెట్టింట్లో వైరల్‌గా మారింది. కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. 

 

అమెరికన్ మోడల్ అయిన హెయిలీ బాల్డ్‌విన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి వీరిద్దరూ తమ కొత్త దాంపత్య జీవితాన్ని తెగ సంతోషంగా గడిపేస్తున్నారు. రోజుకో ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ జంట క‌రోనా కారణంగా  స్వీయ నిర్బంధంలో ఉన్నారు. దీంతో  జస్టిన్‌ బీబర్‌ తన భార్య, మోడల్‌ హేలే బాల్డ్‌విన్‌ను ముద్దు పెట్టుకున్న ఫొటోను సామాజిక మాధ్య‌మాల్లో షేర్‌ చేశారు. ‘నా స్వీయ నిర్బంధ భాగస్వామి’ అంటూ దానికి ట్యాగ్ కూడా ఇచ్చారు. ప్ర‌స్తుతం వీరి ముద్దు ముచ్చ‌ల సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా, గత కొద్దిరోజులుగా స్వీయ నిర్బంధంలో ఉన్న ఈ జంట తమకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా పంచుకుంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: