ప్రపంచ వ్యాప్తంగా కరోనా (కోవిడ్ 19) వైరస్ సృష్టిస్తున్న కలకలం అంతా ఇంతా కాదు.. ఏకంగా ఇప్పుడు అనుమన భూతంతో మనుషులన్న విషయం మర్చిపోయి ఎదుటి వారిని కొట్టి మరీ చంపే పర్థితి నెలకొంటుంది.  మరోవైపు కరోనా భూతం ఇప్పుడు చిన్నా.. పెద్ద అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను గజ్జున వణికిస్తున్నాయి.  కరోనా ఎఫెక్ట్ ఓ మనిషి ప్రాణం తీసింది.. కేవలం అనుమానంతోనే ఓ వ్యక్తిని  కొందరు యువకులు కొట్టిచంపారు. క్యాలే ప్రాంతంలోని ఎంసాబ్వెని గ్రామంలో ఈ ఘటన జరిగింది.

 

జార్జ్ కొటిని హెజ్రోన్ అనే వ్యక్తి బార్ కు వెళ్లి వస్తుండగా ఓ జన సమూహం అతడిని అడ్డగించింది. అయితే అతనికి కరోనా వైరస్ ఉందని అతని వల్ల తమ గ్రామానికి హాని ఉందని.. సమూహంలోని ఓ వ్యక్తి పురమాయించడంతో యువకుడిని దారుణంగా రాళ్లతో కొట్టి మరీ చంపేశారు.  తీవ్రగాయాలపాలైన హెజ్రోన్ ను స్థానిక ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. మొన్నటి వరకు మనుషులను చూస్తే భయం పుడుతుందని అన్నారు.. కానీ ఇప్పుడు కరోనా వైరస్ వల్ల వ్యక్తుల మద్య భయాలు పుట్టుకొచ్చి ఇలా చంపే పరిస్థితి కూడా నెలకొంటుంది.

 

దీనిపై స్థానిక పోలీస్ అధికారి జోసెఫ్ ఎన్ తెంగే మాట్లాడుతూ, మృతుడికి కరోనా వైరస్ ఉందో, లేదో స్పష్టంగా తెలియదన్నారు. కాకపోతే ఆ వ్యక్తి బార్ నుంచి ఊగుతూ రావడం వల్ల అతనికి కరోనా ఉందని.. అందుకే అస్వస్థతకు గురయ్యాడని అనుమానంతో యువకులు అతన్ని దారుణంగా కొట్టి చంపారని అన్నారు. ఇది కేవలం అనుమానంతో జరిగిన సంఘటనే అని.. కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.  ఈ మద్య హైదరాబాద్ లో కూడా ఓ వృద్ద జంటను కరోనా వచ్చింని అపార్ట్ మెంట్ నుంచి పంపించి వేసిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: