దేశం సాంకేతికతో ముందుకు ప్రయాణిస్తుంది అనుకోవాలో, లేక అదే సాంకేతితను ఉపయోగించుకొని దారుణాలకు పాలపడుతున్నారు కొందరు వ్యక్తులు. వీటికి నిదర్శనం చాలానే ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఇలాంటివి ఎక్కువగా డబ్బుల విషయంలో జరుగుతుంటాయి. కానీ ఇలాంటివి ఎన్ని జరుగుతున్న ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతో ఎంత పెద్ద ఘరానా దొంగైనా సరే కొద్దిగా లేట్ అయినా చివరికి పోలీసులకు చిక్కిపోతున్నారు. 

 

 


ఇక అసలు విషయానికి వస్తే.. ఏటీఎంల్లో నింపాల్సిన నగదుతో తోటి ఉద్యోగులను మస్కా కొట్టించిన దొంగ ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు. హైదరాబాద్ లోని సీపీ అంజనీ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... ఏటీఎంలలో నగదు నింపే బాధ్యతలను CMS అనే సంస్థ నిర్వహిస్తుంది. రోజుమాదిరి సంస్థలో డబ్బులను తీసుకెళ్లే వాహనం డ్రైవర్‌ గా పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన ప్రకాశ్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. కాకపోతే సోమవారం నాడు రోజులాగే కోఠిలోని sbi ప్రధాన కార్యాలయం నుంచి డబ్బులు తీసుకొని ఏటీఎంలలో నింపేందుకు మొత్తం నలుగురు సిబ్బంది కలిసి బయలుదేరారు. ఇందులో ముగ్గురు సిబ్బంది ఒక ఎటీఎంలో నగదు నింపడానికి లోనికి వెళ్లారు.

 

 

వారందరు కలిపి మొత్తం కలిపి రూ.68 లక్షలు పెట్టడానికి వెళ్లగా, మిగితా రూ.92 లక్షలతో ఉన్న వాహనాన్ని యూ టర్న్ తీసుకువస్తానని చెప్పి వాహనాన్ని తీసుక వెళ్లాడు. అప్పుడు అలా వెళ్లిన ప్రకాశ్ ఆ వాహనాన్ని లాలాపేట ప్లై ఓవర్ సమీపంలో వాహనాన్ని వదిలి అందులో ఉన్న డబ్బు తీసుకుని ఉడాయించాడు. దీనితో నార్త్ జోన్ సంబంధించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు లాలాపేట్‌ లో ఆ డ్రైవర్‌ ను అరెస్టు చేశారు. ఈ కిలాడీ నిందితుడిని పట్టుకునేందుకు ఏకంగా 500 CC టీవీ కెమెరాల ఫుటేజ్‌ ను వెతికారు. పట్టుకున్న తర్వాత డ్రైవర్ వద్ద నుండి పూర్తి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు వారు తెలియచేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: