తెలుగు ఇండస్ట్రీలో అప్పట్లో ఓ చిత్రంలో రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో.. అనే పాట గుర్తుంది కదా.. భారత దేశంలో అత్యుత్తమ చిత్రకారుల్లో ఒకరు రవివర్.  రామాయణ, మహాభారతములలోని ఘట్టాలను చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందాడు. భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు. చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో అతనికి  అతనే సాటి.  1873లో జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నప్పుడు ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది.  

 

1906లో, 58 సంవత్సరాల వయసులో ఆయన మరణించాడు.  ఈయన మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి. ఆ తరువాత వాటిని అధికారికముగా తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు. ఆయన కుంచె నుంచి జాలువారిన కళాఖండాలు ప్రపంచ ప్రాచుర్యం పొందాయి.  తాజాగా రవివర్మ మలచిన విశ్వామిత్రుడు పేయింటింగ్ ఓ అంతర్జాతీయ వేలంలో కోట్ల ధర పలికింది. ప్రముఖ వేలం సంస్థ సోత్ బీస్ నిర్వహించిన ఆన్ లైన్ వేలం ప్రక్రియలో రవివర్మ 'విశ్వామిత్రుడు' పెయింటింగ్ ను ఓ అజ్ఞాత వ్యక్తి రూ.6.45 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నాడు.

 

 భారతీయులకు వివ్వామిత్రుడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  స్వర్గలోక ఆహ్వానం అందలేదని.. అక్కడ ఆయనకు అవమానం జరిగిందని ఏకంగా త్రిశంకు స్వర్గాన్నే సృష్టించారు.  విశ్వామిత్రుడిపై ఎన్నో చిత్రాలు కూడా వచ్చాయి.  ఇదిలా ఉంటే..  రెండేళ్ల కిందట రవివర్మ 'దమయంతి' పెయింటింగ్ ఇంతకు రెట్టింపు ధర పలికింది. తాజాగా, 'విశ్వామిత్రుడు' పెయింటింగ్ కోసం గతనెలలో ఆన్ లైన్ బిడ్డింగ్ కు తెరలేపగా, రెండ్రోజుల కిందటే బిడ్డింగ్ ప్రక్రియ ముగిసింది. తైల వర్ణ చిత్రకళను బ్రిటీషు దేశస్థుడయిన థియోడార్ జెన్సన్ వద్ద నేర్చుకున్నాడు. పాశ్చాత్య చిత్రకళలోని శక్తి, కొట్టొచ్చినట్లున్న భావ వ్యక్తీకరణ, రవివర్మను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అవి భారతీయ చిత్రకళాశైలికి ఎంతో భిన్నంగా కనిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: