ఎట్టకేలకు అనగా రేపు ఉదయం ఐదున్నర గంటలకు నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు కాబోతుంది. ఇప్పటివరకు ఎన్నో కోర్టులలో సవాలక్ష పిటిషన్లు వేసి ఉరి శిక్షని ఆలస్యం చేసిన నిర్భయ నిందితులను ఢిల్లీ పాటియాలా కోర్టు రేపే అనగా మార్చి 20న ఉరితీస్తున్నామని ప్రకటించే సరికి ప్రస్తుతం దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం అనగా రేపు ఉదయం ఐదున్నర గంటలకు నిర్భయ నిందితులకు శిక్ష అమలు అయ్యే నేపథ్యంలో... ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలంటూ వినయ్, పవన్, ముఖేష్ బుధవారం నాడు కోర్టును ఆశ్రయించారు.



అయితే జడ్జ్ ధర్మేంద్ర రాణా ఈ సందర్భంగా మాట్లాడుతూ... మీరు ఎప్పుడు దోషులకు ఉరి అమలు అయ్యే చివరి క్షణంలోనే వస్తుంటారు అని నిర్భయ దోషుల తరపు లాయర్ ను ఉద్దేశించి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. అలాగే మరణశిక్ష అమలు పై స్టే విధించే సమస్య లేదని స్పష్టం చేస్తూ... మార్చి 5వ తేదీన పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారంట్లు జారీ చేసిన ప్రకారం తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలు అవుతుందని ఢిల్లీ న్యాయస్థానం తేల్చి చెప్పేసింది.

 



అయితే నిందితుల తరపు లాయర్ ఏపీ సింగ్ మాట్లాడుతూ... పవన్ గుప్తా వేసిన రెండవ క్షమాభిక్ష పిటిషన్, అక్షయ్ సింగ్ భార్య విడాకుల కోసం బీహార్ కోర్టులో వేసిన పిటిషన్, తన క్షమాభిక్ష పిటిషన్ లో అవకతవకలు జరిగాయంటూ వినయ్ వేసిన మరో పిటిషన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పిటిషన్లు పెండింగ్లు, న్యాయ రెమిడీస్ మిగిలి ఉన్నాయని వాదనలు చేశాడు.

 



అయితే ఇలాంటివి వంద దరఖాస్తులు మీరు దాఖలు చేయగలరు కానీ ఇవి అస్సలు న్యాయ రెమిడీసే కావని అంటూ ఢిల్లీ కోర్టు ఏపీ సింగ్ వాదనలను తోసిపుచ్చింది. ఒక నిందితుడు దాఖలు చేసిన పిటిషన్ లో... ఢిల్లీ లో కోవిడ్ 19 ఉందని ఉరిశిక్ష అమలు చేసేటప్పుడు వందల మంది తరలి వస్తారని అప్పుడు ప్రజలకు కోవిడ్ సోకే ప్రమాదం ఉంటుందని అందుకే కోవిడ్ 19 సంక్రమణ పూర్తిగా తగ్గేంతవరకు ఉరి తీయకూడదని పేర్కొనడం గమనార్హం. ఇకపోతే కోర్టు బయట అక్షయ్ భార్య సృష్టించిన డ్రామా అంతా ఇంతా కాదు. ఢిల్లీ కోర్టు పిటిషన్లను కొట్టి వేసేటప్పుడు ఆమెకు ఏదో మైకం వచ్చినట్టు పడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: