కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో స్కూళ్ళకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అలాగే వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కూడా కల్పించారు సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు. దీంతో ఎవరు రోడ్ల మీదకు రావడం లేదు. ఇక ఇలా కిరాణా షాపులకు వెళ్లడం చాలా తగ్గించేశారు. దీంతో పాలు, కూరగాయలు లాంటి వాటి కోసం ఆన్ లైన్ షాపింగ్ యాప్‌లు వాడుతుంటే, గ్రోసరీస్‌ కోసం గ్రోఫర్స్‌, బిగ్‌బాస్కెట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి వాటికి డిమాండ్ బాగా పెరిగి పోయింది. సాప్ట్ వేర్లు కూడా వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ కావటంతో వారు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో సహా చాలా మంది కొనుగోలుదారులు నిత్యావసరాలను సైతం ఆన్‌ లైన్‌ లోనే కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

 

 

 

బయటకు వెళితే ఎక్కడ వైరస్‌ వ్యాప్తి చెందుతుందనే భయంతో ఇళ్లను వదలటం లేదు. అన్ని రకాల సమనుకు ఆన్లైన్ కొనుగోలునే ఉపయోగిస్తున్నారు. అయితే.. ఈ కారణంగా ఈ నెలలో మొదటి వారంలోనే గ్రోఫర్స్‌, బిగ్‌ బాస్కెట్‌ లాంటి సైట్లలో ఆర్డర్స్ 80శాతం నుంచి 100 శాతం వరకు పెరిగాయని చెబుతున్నారు. అంతేకాదు  సూపర్‌ మార్కెట్‌ లు సైతం హోమ్ డెలివరీ ఆర్డర్స్ సదుపాయాన్ని అందిస్తున్నారు. అలాగే.. రైస్‌, దోశ, ఇడ్లీ పిండి, పప్పులు వంటి వాటిని ఎక్కువ మంది ఆన్‌ లైన్‌ లో కొనుగోలు చేస్తున్నారు. అంతకుముందు అమెరికాలో సార్స్ వ్యాధి వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సందర్భాలలో అక్కడ ఆన్ లైన్ లో సరుకులు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారనీ చెప్తున్నారు. 

 

 

 

లోకల్‌ వెబ్‌ సైట్ల పేర్లతో కొంత మంది నకిలీలను సృష్టిస్తున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెపుతున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో డెలివరీ బాయ్స్ కు వీలైనంత దూరంగా ఉండాలని అంటున్నారు. ప్యాక్ తీసుకున్న అనంతరం సానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకుంటే మంచిదని చెపుతున్నారు నిర్వాహకులు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: