రోజురోజుకి దేశంలో కరోనా కేసులు పెరుగుతూన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఏకంగా 15 పాజిటివ్ కేసులు దాక నమోదు అయ్యాయి. అందులో ఈరోజు ఏకంగా మన తెలుగు రాష్ట్రమైన తెలనగానలో ఏకంగా 7 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి క్రమక్రమంగా పెరుగుతోంది. వార్తలు అందే సరికి 13 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఇందులో 9 మంది విదేశీయులే కావడం ఆలోచించాల్సిన విషయం.

 


ఇక అసలు విషయానికి వస్తే... తాజాగా కామారెడ్డిలో కరోనా కలకలం సృష్టిస్తుంది. అక్కడ ఒక ఆర్మీ జవాన్ లో కరోనా లక్షణాలు ఉండడంతో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యి మొదట కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాని తర్వాత కరోనా పరీక్షల కోసం జవానుని హైదరాబాద్ లోని చెస్ట్ ఆస్పత్రికి అతడిని పాప్మపడం జరిగింది. ఇక ఆ జవాను 3 రోజుల క్రితం జమ్ము కశ్మీర్ నుంచి రైలులో కామారెడ్డికి చేరుకున్నాడు. ఆ జవాన్ ప్రయాణించిన రైలులో మొత్తం 8 మందికి కరోనా ఉన్నట్లు అధికారులు ఇప్పుడు అనుమానాలు తెలుపుతున్నారు.

 

 


ఇకపోతే కరీంనగర్ లో మొత్తం 7 విదేశీయులుకు బుధవారం కరోనా పాటిజివ్ వచ్చినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేసారు. ఆ 7 మంది విదేశీయులు ఇటీవల ఢిల్లీ నుంచి రామగుండం వరకు "ఏపీ సంపర్క్ క్రాంతి" ట్రైన్ లో రాగ అదే రైలులో ప్రయాణించిన ఈ ఆర్మీ జవాన్ కూడా వచ్చారు. కాబట్టి ప్రభుత్వం వారు ప్రయాణించిన ఏపీ సంపర్క్ క్రాంతి రైలులోని S-9 బోగీలో వారితో పాటు అందులో ప్రయాణించిన వ్యక్తుల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

 

 

తెలంగాణ పరిస్థితులని దృష్టిలో ఉంచుకొని దీంతో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ రోజు బీఆర్కే భవన్లో మంత్రి ఈటల రాజేందర్ ఒక సమీక్ష నిర్వహించారు.  ఈ సమావేసంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మరిన్ని నిర్ణయాలు అధికారులు తీసుకోనున్నారు. కరోనా వైరస్ కట్టడికి కేసీఆర్ సర్కార్ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం అందుతోంది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయడం, అలాగే హైదరాబాద్ సిటీలో ఆంక్షలు మరింత కఠినతరం చేయడం ఇంకా ఆర్టీసీ బస్సు సర్వీసులను పరిమితం చేయడం, అలాగే హోటల్స్ మూసివేత వంటి నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: