ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా దెబ్బకు దేశాలు గడగడలాడుతున్నాయి. ఇప్పటికే 165 దేశాలకు పైగా ఈ వైరస్ బారిన పడ్డాయి. 7 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక తెలుగు రాష్టర్లకు కూడా ఈ మహమ్మారి రావడంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ మహమ్మారి రావడంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే తెలంగాణాలో 13 మందికి పాజిటివ్ రాగా .. ఆంధ్రలో రెండు కేసులు నమోదు అయ్యాయి. ఇటు ప్రభుత్వాలు, అటు వైద్య నిపుణులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.  ముఖ్యంగా తెలంగాణలో క్రమంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి... ప్రజలు ఆందోళన చెందుతుండగా... ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.

 

ముఖ్యంగా రాష్ట్రంలో కేసులు నమోదు కాకపోయినా... విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకే కరోనా పాజిటివ్ వస్తుండడంతో... విదేశీ ప్రయాణికులు వచ్చే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డేగకన్ను పెట్టింది తెలంగాణ సర్కార్. నిన్న ఒక్కరోజే 1500 మంది విదేశాల నుండి వచ్చిన వారిని క్వారెంటైన్ కు తరలించారు అధికారులు. ఇక, విదేశీయుల రాకపోకలను గమనించేందుకు ఐదుగురు ఐఏఎస్‌లతో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కమిటీలో సీనియర్ ఐఏఎస్ అధికారి సునీల్ శర్మ, సందీప్ సుల్తానీయా రోనాల్డ్ రాస్ తదితరులున్నారు. కాగా, తెలంగాణలో కరోనా పిజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరిన సంగతి తెలిసిందే.

 

తాజాగా హైదరాబాద్ లో కరోనా గురించి ఓ వినూత్న ప్రదర్శన చేస్తూ సూచనలు ఇచ్చారు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రకటనల ద్వారా ప్రజలకు వివరిస్తోంది. ఈ విషయమై ప్రజలను చైతన్యపరిచేందుకు పోలీస్ శాఖ కూడా తమ వంతు ప్రయత్నం చేస్తోంది.  ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు ఆగి ఉన్న సమయంలో ‘కరోనా’ సోకకుండా పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను రాచకొండ ట్రాఫిక్ పోలీసులు పోస్ట్ చేశారు. కొత్తపేట సర్కిల్ పరిధిలో వాహనదారులకు ‘కరోనా’పై పోలీసులు పలు సూచనలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: