ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా నిమిషం నిమిషానికి కోర‌లు చాస్తూ చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా గురువారం సాయంత్రానికి అందిన లెక్క‌ల‌ను బ‌ట్టి చూస్తే 2. 23 లక్ష‌ల మంది కరోనా వైర‌స్ కు గుర‌య్యారు. ఇక ఇట‌లీ, ఇరాన్‌, ద‌క్షిణ కొరియా, చైనా స‌హా మొత్తం 174 దేశాల్లో క‌రోనా రాజ్యం విస్త‌రించింది. గంట గంట‌కు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మృతులు 9149కు చేరుకున్నారు. ఇటలీ, ఇరాన్‌, ద‌క్షిణ కొరియా... చైనా స‌హా మొత్తం 174 దేశాల్లో క‌రోనా వైర‌స్ పాకింది.



చైనా నుంచి ప్రారంభ‌మై యూర‌ప్‌తో స‌హా అమెరికా, ఇట‌లీ, ఇరాన్‌, ఆసియా, మ‌ధ్య ఆసియా దేశాల్లోనూ ఈ వైర‌స్ విజృంభిస్తోంది. ఇక ఈ క్ర‌మంలోనే భార‌త్‌లోనూ క‌రోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య నాలుగు కు చేరుకుంది. కరోనా మహమ్మరి భారత్‌లో మరోకరిని బలితీసుకుంది. పంజాబ్‌లో కరోనా వైరస్‌ సోకిన 72 ఏళ్ల వృద్దుడు గురువారం మృతిచెందాడు. ఇటీవలే అతను జర్మనీ నుంచి ఇటలీ మీదుగా భారత్‌కు వచ్చినట్టుగా తెలుస్తోంది.



ఇప్పటివరకు కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్రలలో కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా సమాచారం ప్రకారం దేశంలో కరోనా సోకినవారి సంఖ్య 167 కు చేరింది. మ‌న‌దేశంలో మ‌హారాష్ట్ర‌లో క‌రోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. ఇక ఈ క్ర‌మంలోనే కేంద్రం సైతం ఇప్ప‌టికే కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దులు మూసి వేయ‌డంతో పాటు 10 ఏళ్ల లోపు పిల్ల‌లు.. 65 ఏళ్లు దాటిన వృద్ధులు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని ఆదేశాలు జారీ చేసింది.



ఇక ఇంట‌ర్నేష‌న‌ల్ విమానాల‌పై నిషేధం విధించ‌డంతో పాటు మార్చి 22 నుంచి 29 వ‌ర‌కు అంత‌ర్జాతీయ విమానాలు ర‌ద్దు చేసింది. ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చే విమానాల‌పై నిషేధం విధించారు. ఇక ఇటలీలో బ‌య‌ట‌కు వస్తే జైలు శిక్ష వేస్తున్నారు. స్పెయిన్‌లో ఉన్న నాలుగున్న‌ర కోట్ల మంది ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని ఆదేశాలు జారీ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: