నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ పేరు ఇపుడు ఏపీ రాజకీయాల్లో మారుమోగుతోంది. ఆయన 2016 ఏప్రిల్ 1న ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నియమితులయ్యారు. గత నాలుగేళ్ళుగా ఏపీలో లోకల్ బాడీ ఎన్నిక‌లు లేవు కాబట్టి అయనకు పెద్దగా పని లేదు. మీడియా ఫోకస్ కూడా లేదు.

 

ఎపుడైతే ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టాలని వైసీపీ సర్కార్ డిసైడ్ చేసిందో అపుడే మీడియా ముందుకు నిమ్మగడ్డ వచ్చారు. అంతా అనుకున్నట్లుగా ఎన్నికల వ్యవహారం సాగుతున్న టైంలో భారీ ట్విస్ట్ ఇచ్చి ఎన్నికలను వాయిదా వేశేశారు. దాంతో నిమ్మగడ్డ ఒక్కసారిగా  నేషనల్ లెవెల్లో పాపులర్ అయిపోయారు. ఆయన సోషల్ మీడియాలో ఇపుడు ఓ సెలిబ్రిటీగా ఉన్నారు.

 

నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా చేస్తే దాన్ని చిరిగి చాట చేసుకుంది వైసీపీ సర్కార్. ఏకంగా జగన్ పెద్ద నోరు  పెట్టి కులాన్ని మధ్యకు తీసుకురావడంతో నిమ్మగడ్డ మీద ఉన్న వ్యతిరేకత కాస్త వైసీపీ మీదకు మళ్ళింది. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు కలసికట్టుగా తిట్టడంతో ఆయన టీడీపీ సహా విపక్షాలకు దేవుడు అయిపోయాడు.

 

ఇపుడు నిమ్మగడ్డను అడ్డం పెట్టుకుని పచ్చ పార్టీ చేయాల్సిన అల్లరి అంతా ఒక పధ్ధతి ప్రకారం చేస్తోందని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. నిమ్మగడ్డ నాకు ప్రాణ హాని ఉందంటూ కేంద్ర హోం శాఖకు లేఖ రాసినట్లుగా ఒక ఫేక్ లెటర్ స్రుష్టిస్తే అది టీడీపీ అనుకూల  పత్రికలకు అతి పెద్ద అహారం అయింది.

 

ఆ లేఖను నేను రాయలేదు అన్న నిమ్మగడ్డ ఖండనను కూడా పట్టించుకోకుండా విషాన్నంతా వండి వార్చేశారు. అబద్దమైనా కూడా అమాయక‌ ప్రజలు  నమ్మితే చాలనుకున్నారు. ఆ విధంగా పచ్చ పార్టీ అనుకూల మీడియా మోతుబరులు ఇపుడు నిమ్మగడ్డ రూపేణా టీడీపీకి చేయాల్సిన మేలు చేద్దామనుకుంటున్నారు. మరో వైపు ఏపీలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు  కన్నా లక్ష్మీనారాయణ సైతం టీడీపీ స్టాండ్ తీసుకున్నారు. నిమ్మగడ్డను భద్రత కావాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు.

 

అసలు తాను లెటర్ రాయలేదు అంటున్న నిమ్మగడ్డను పక్కన పెట్టి ఎల్లో మీడియాలో వచ్చే న్యూస్ నే   బైబిల్, ఖురాన్, భగవద్గీత మాదిరిగా భావించే  టీడీపీ చెంతకు మొత్తం విపక్షం చేరడమే ఈ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్. మరో వైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇంత జరుగుతున్నా గట్టిగా ఖండిస్తూ ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయకపోవడం, ప్రెస్ నోట్ విడుదల చేయకపోవడం గమనార్హం.

 

 ఆయన ఆలా మౌనంగా ఉంటే రెచ్చిపోతూ పచ్చ పార్టీ, దాని వెనక మిగిలిన పార్టీలు ఏపీలో శాతి భద్రతలు లేవన్నదాకా వెళ్ళిపోయాయి. మొత్తం మీద చూసుకుంటే నిమ్మగడ్డ ఎపిసోడ్ లో ఫేక్ న్యూస్ ని కూడా ఎంత బాగా వాడుకోవాలో పచ్చ పార్టీ నేతలకు తెలిసినంతగా ఎవరికీ తెలియదెమో. అందుకే అచ్చెన్నాయుడు రాష్ట్రపతి పాలన దాకా వెళ్ళిపోయారు. మరి దీనికి వైసీపీ  గట్టి దెబ్బ వేసి విరుగుడు మంత్రం వేస్తేనే తప్ప ఈ పచ్చ వైరస్ ఆగేలా లేదంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: