తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ రాజకీయ నేతగా రేవంత్ రెడ్డి మంచి పేరు సంపాదించారు. రాష్ట్రం విడిపోయాక తెలుగుదేశం పార్టీలో ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నా గాని ఎప్పుడు కేసీఆర్ని టార్గెట్ చేస్తూ చాలా దూకుడుగా వ్యవహరిస్తూ వచ్చేవాళ్ళు. ఎలాంటి సందర్భంలో అయినా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లో రాజకీయంగా కేసీఆర్ ని మరియు ఆయన కుమారుడు కేటీఆర్ ని ఇరుకున పెట్టడం లో రేవంత్ రెడ్డి ని మించిన వారు లేరని చాలామంది తెలంగాణ రాజకీయ మేధావులు అంటుంటారు. అటువంటి ఫైర్ బ్రాండ్ కలిగిన రేవంత్ రెడ్డి కి రాజకీయపు బుల్లెట్ ఎక్కడ దింపాలో అక్కడ దింపాడు కే‌సి‌ఆర్. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి చాలా దూకుడు రాజకీయాలు చేస్తూ పార్టీ సీనియర్ నాయకులకు చమటలు పట్టించడం జరిగింది.

 

ఇటువంటి రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి వస్తే ఖచ్చితంగా తనకి మరియు తన ప్రభుత్వానికి గ్యారెంటీగా డేంజర్ రోజులు స్టార్ట్ అయినట్లు అని భావించిన కెసిఆర్ వ్యూహంలో భాగంగా డ్రోన్ మరియు భూకబ్జా కేసులో అడ్డంగా బుక్ చేసినట్లు తెలంగాణ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి వంటి వాళ్లు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విభేదించిన డం జరిగింది. ఇటువంటి నేరపూరిత చరిత్ర కలిగిన నాయకుడిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెంచి పోషిస్తే పార్టీ పుట్టగతులు ఉండవని చాలా మంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రేవంత్ వ్యవహారం పట్ల మండి పడటం జరిగింది.

 

ఇదే తరుణంలో కేసీఆర్ తన వ్యూహంలో రెడ్డి సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవడానికి సరికొత్తగా ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులకు పార్టీ నుండి ఇచ్చే పదవుల్లో ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉండే రెడ్డి సామాజిక వర్గం తన వైపు ఆకర్షించడంతో పాటు రేవంత్ రెడ్డి ని ఏకాకి చేసినట్లవుతుందని...రేవంత్ రెడ్డి ని జైలు కి పంపించి పొలిటికల్ గా విలవిల లాడేటాట్లు సీఎం కేసీఆర్ ఈ వ్యవహారంలో వ్యవహరించారని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: