ప్రపంచానికి కరోనా వైరస్ భయం పట్టుకుంది. చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా  వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలోనే భారత్లోకి కూడా అడుగుపెట్టింది ఈ మహమ్మారి. ఇక తెలుగు రాష్ట్రాలను కూడా ప్రాణభయంతో వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజురోజుకు కరోనా  వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండడంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దీంతో కఠిన నిబంధనలు అమలులోకి తెస్తున్నాయి. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఎన్నో  ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రోజురోజుకు కరోనా వైరస్ కేసులు మాత్రం పెరిగిపోతున్నది . ఇప్పటికీ కరోనా వైరస్ బారిన పడిన వారికి... ఐసోలేషన్ వార్డులో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. 

 

 

 అంతేకాకుండా కరోనా  వైరస్ నియంత్రణకు రాష్ట్రం దిగ్బంధం లోకి వెళ్లి పోతున్న విషయం తెలుస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల కాకుండా జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో మొత్తం నిషేధం విధిస్తూ కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చింది తెలంగాణ సర్కారు. అయితే ఎన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి విదేశాల నుంచి వస్తున్న వారి వల్లనే ప్రత్యక్షంగా కరోనా వైరస్ తెలంగాణ వాసులకు కూడా సోకుతుంది అని భావించిన తెలంగాణ సర్కార్ ఈ విషయంలో కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చింది. 

 

 

 విదేశాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వాళ్ళు ముందుగానే పోలీసులకు సరెండర్ కావాలి అంటూ కేసిఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వచ్చిన వారు ముందుగా పోలీసులకు సరెండర్ అయ్యి.. హోమ్ క్వారంటైన్ లో  ఉండాలి అంటూ కేసీఆర్ సర్కార్ సూచిస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఈ  నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: