కొందరు తరచూ ప్రయాణాలు చేస్తుంటారు. కొందరు పని ఒత్తిడి నుండి రిలీఫ్ పొందడానికి టూర్స్ కి వెళ్తారు. కొందరికి ఐఆర్‌సీటీసీ అకౌంట్ కూడా ఉండే ఉండొచ్చు. అలాంటి వారి కోసమే ఈ వార్త. రైలు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మీరు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సైబర్ నేరగాళ్ల చేతికి మీ డీటెయిల్స్ అన్నీ చేరిపోతాయని ఐఆర్‌సీటీసీ సంస్థ ప్రయాణీకులను హెచ్చరిస్తోంది.

 

 

అకౌంట్ నెంబర్, ఏటీఎం కార్డు నెంబర్, పిన్, సీవీవీ, యూపీఐ లాంటి ఇంపార్టెంట్ సమాచారాలను ఫోన్ కాల్, ఈ-మెయిల్స్ ద్వారా ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని సూచిస్తోంది. తాము ఐఆర్‌సీటీసీ అధికారులమని, బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని ఎవరైనా కాల్స్ చేస్తూన్నారు. వారు మిమ్మల్ని నమ్మించి మీ వివరాలను అడిగే అవకాశం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వారితో వ్యక్తిగత వివరాలను షేర్ చేసుకోకూడదన్నారు. పొరపాటున మీరు ఎవరికీ అయినా చెబితే మాత్రం బ్యాంక్ అకౌంట్లలో సొమ్ము ఖాళీ అయిపోతుందన్నారు.

 

 

బ్యాంకు ఖాతా వివరాలు, ఐఆర్‌సీటీసీ అకౌంట్ డీటైల్స్, ఓటీపీ, పాస్‌వర్డ్‌ తదితర అంశాలపై తమ సిబ్బంది ఏ ప్రయాణీకుడికి ఫోన్ చేయదని సంస్థ పేర్కొంది. రీఫండ్స్, టీడీఎస్, ఇ-టికెట్ క్యాన్సలేషన్ లాంటివన్నీ కూడా ఆటోమేటిక్‌ గానే జరుగుతాయన్నారు. కాబట్టి ఆ రీ-ఫండ్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు వారికీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్‌ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలని ఐఆర్‌సీటీసీ కోరింది.

 

 

ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని వాడుకొని మనకు తెలియకుండానే మన బ్యాంకు ఖాతాలోని డబ్బులను కాజేస్తున్నారు. టెక్నాలజీ పెరిగింది దానికి మంచికి వాడుకునే వారి కంటే చెడుకు వాడుకునే వారే ఎక్కువగా ఉన్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు సైబర్ నేరాలపై ప్రయాణికుల్లో,ప్రజల్లో అవగాహన కల్పించడం వలన కొంత వరకు నేరాలను అరికట్టవచ్చు. నేరస్తుల బారి నుండి ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: