మొన్నటివరకు చైనా దేశంలో ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న మహమ్మారి కరోనా  వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలుసిందే . దీంతో ప్రపంచ దేశాల ప్రజలందరూ చిగురుటాకులా వణికిపోతున్నారు. ఈ క్రమంలోనే భారతదేశంలో కూడా ఈ మహమ్మారి అడుగుపెట్టింది. ఇప్పటివరకు ఏకంగా 160 కి పైగా కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ముగ్గురి ప్రాణాలను ఈ మహమ్మారి వైరస్ బలితీసుకుంది. ఇక ఈ మహమ్మారి  భారత దేశంలో ప్రవేశించిన రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా ప్రముఖంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా  వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. 

 

 

 దీంతో అప్రమత్తమైన తెలంగాణ సర్కారు ఎన్నో కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. అయితే ఎన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ రోజురోజుకు కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల్లో  ఆందోళన నెలకొంది. అయితే రోజురోజుకు కరోనా వ్యాప్తి  ఎక్కువవుతున్న నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా  నియంత్రణకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. 

 

 

 పరిస్థితి చేయి దాటి పోకముందే అందరూ కరోనా  నియంత్రణకు సహకరించాలి అంటూ కోరారు. అయితే కరోనా వైరస్ ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతున్నది  అంటూ తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్... దీనికి ప్రజల సహకారం కూడా అవసరం అంటూ తెలిపారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ఎన్నో కఠిన నిర్ణయాలను కూడా తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే రాష్ట్రాన్ని దిగ్బంధం చేసిన ముఖ్యమంత్రి.. తాజాగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఎవరైనా బేఖాతరు చేస్తే సహించేది లేదు అంటూ హెచ్చరించారు కేసిఆర్.. ప్రభుత్వం విధించిన నిబంధనలు అందరూ తప్పక పాటించాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: